వైయ‌స్ఆర్‌ సీపీ ఓ కుటుంబం 

 వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి 

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబం వంటిదని, పార్టీ కార్యకర్తలు నిబద్ధతో పనిచేస్తున్నారని  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిజాయతీగా కష్టపడితే పదవులు వెతుక్కుంటూ వస్తాయని సీఎం వైయ‌స్ జగన్ నిరూపించారని పేర్కొన్నారు. ప్రజలతో మమేకం అవుతూ, ప్రజల కోసం పనిచేసే వారికి నాయకత్వ లక్షణాలు వాటికవే వస్తాయని తెలిపారు. అయితే, పదవులు కొందరికి ముందుగా వస్తాయని, మరికొందరికి తర్వాత వస్తాయని, అంతమాత్రాన పదవులు రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సమాన గౌరవం ఉంటుందని సజ్జల రామ‌కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top