టీడీపీ అరాచకాలపై ప్రజలను చైతన్యపరుస్తాం..

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్‌..

హైదరాబాద్‌: తనను వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం పట్ల సినీనటుడు పృథ్వీరాజ్‌   హర్షం వ్యక్తం చేశారు.తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.తన సహచర సినీనటులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి టీడీపీ ప్రభుత్వ అరాచకాలపై ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.టీడీపీ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలేదని తెలిపారు.టీవీ కళాకారులతో ప్రతి గ్రామానికి వెళ్ళి టీడీపీ వైఫల్యాలను వివరిస్తామని తెలిపారు. పృథ్వీ నియామకం పట్ల నటుడు కృష్ణుడు సంతోషవ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అభిమానులు  శుభాకాంక్షలు తెలిపారు.

 

 

Back to Top