175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చాం

మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నాం

వైయ‌స్ఆర్‌సీపీ తుది జాబితాలో ఇది కనిపిస్తుంది

ఇడుపుల‌పాయ‌: వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడమే మా లక్ష్యమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ సీఎం వైయ‌స్ జగన్‌ సమక్షంలో..  అభ్యర్థుల పేర్లను రిలీజ్‌ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం 175, లోక్‌సభ ఎన్నికల 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించనున్నారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 
 
 
వైయ‌స్ఆర్‌సీపీ జాబితాలో మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం.. ఇప్పుడు తుది జాబితాలోనూ అది కనిపిస్తుందని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చాం.. పెద్దగా మార్పు ఉండవని స్పష్టం చేశారు.. ఐదేళ్లలో అభివృద్ధి.. సంక్షేమం విషయంలో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం రాజీ పడలేదని ఉద్ఘాటించారు.. ప్రస్తుతం ఉన్న విధానంలో వైయ‌స్ఆర్‌సీపీ సీఏఏను వ్యతిరేకిస్తుందన్నారు..  175 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లను గెలిచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స‌జ్జ‌ల‌ వెల్లడించారు. 

Back to Top