వివేకా హత్య కేసులో ఇప్పుడు ముసుగు తొలగింది..!

సునీత మాట్లాడినవ్నీ చంద్రబాబు పలికించిన చిలుకపలుకులే

ఎన్నికల వేళ రాజకీయ కుట్రతోనే ఢిల్లీలో సునీత ప్రెస్‌ మీట్

మీడియా స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

నాడు వివేకాను ఓడించిన వ్యక్తులకే నేడు సునీత థ్యాంక్స్ చెప్తున్నారు.

అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణలు చేసి,జగన్‌ గారిని  శిక్షించమనడం విచిత్రం.

వివేకా హత్యలో ఆమె కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమోనన్న అనుమానాలున్నాయి. 

వాటిని తప్పించుకోడానికి దొంగే.. దొంగ దొంగ అన్నట్లు మాట్లాడుతున్నారేమో! 

తన తండ్రిని కిరాతకంగా చంపినవాడు సునీతకు మంచోడెలా అయ్యాడు? 

పవన్‌ 24 సీట్లు తీసుకుని 240 సీట్లు అనుకుంటే ఎలా?

చంద్రబాబు పెట్టుకున్న ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ జనసేన. 

తాడేపల్లిగూడెం సభను చూశాక వారిద్దరి పని క్లోజ్‌ అని అర్ధమైంది

అమ‌రావ‌తి:  వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఇప్పుడు ముసుగు తొల‌గింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మరి అలాంటప్పుడు ఈ కేసు కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయింది? అని అన్నారు. తాజాగా వివేకా కేసుపై సునీత చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం సచివాలయం వద్ద సజ్జల రామ‌కృష్ణారెడ్డి  మీడియాతో మాట్లాడారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఏమ‌న్నారంటే: 

అవి చంద్రబాబు పలికించిన చిలుకపలుకులే:
– సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరి ప్రతినిధిగా ఇన్నాళ్లూ తప్పుడు కేసు బిల్డ్‌ చేస్తున్నారో అంతా ఈ రోజు బయటపడింది. 
– ఆమె మాట్లాడిన దానికంటే.. ఇందుకు వేరే ఆధారాలు అవసరం లేదు. 
– ఆమె మాట్లాడినవన్నీ చంద్రబాబు పలికించిన చిలుకపలుకులు అనేది ఇంతకంటే పెద్ద ఆధారం ఏమీ ఉండదు. 
– ఆమె తన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి మేమే కారణమని ఆరోపిస్తున్నారు. 
– ఆనాడు 2017లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు 160 పైగా ఓట్లు అధికంగా వైఎస్సార్సీపీకి ఉన్నాయి. 
– స్థానిక సంస్థల కోటా కింద వివేకానందరెడ్డి గారు థంపింగ్‌ మెజార్టీతో గెలవడానికి కావాల్సినన్ని ఓట్లు పార్టీకి ఉన్నాయి. 
– అందుకోసమే తన చిన్నాన్నను జగన్‌ గారు అభ్యర్థిగా పెట్టారు. 
– చంద్రబాబులా ఓడిపోయే సీటుకు పోటీ పెట్టలేదు. 
– మేము గెలిచే సీటుకు ఆయన తన చిన్నాన్న గారిని పెట్టారు. 
– వైఎస్సార్‌ గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌ వైపు వెళ్లి జగన్‌ గారిని రాజకీయంగా అంతుచూడాలని..విజయమ్మ గారి మీద వారే పోటీకి దిగారు. 
– అయినా వివేకాను దగ్గరకు తీసుకున్నది వైఎస్‌ జగన్‌ గారు. వివేకా కూడా అలానే వచ్చి పార్టీలో కలిసిపోయారు. గతంలో జరిగినవి పొరపాటు అని చెప్పారు. 
– ఆయన అడక్కుండానే వివేకాను జగన్‌ గారు అభ్యర్థిగా పెట్టారు. 
– వాస్తవంగా వివేకా సునాయసంగా గెలిచిఉండాలి. 
– అలాంటి వ్యక్తిపై ఆనాడు పోటీకి దిగింది ఎవరు..? ఈ రోజు ఆమె ఎవరికైతే థ్యాంక్స్‌ చెప్తోందో అదే బీటెక్‌ రవి. 
– అతను గెలిచి, తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పన్ని ఉండాలి..? 
– బీటెక్‌ రవి గానీ, మా దగ్గర నుంచి ఫిరాయించి మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి గానీ కుట్ర పన్ని ఉండాలి. 
– వివేకాపై ఏదన్నా చేయాలంటే వాళ్లకు ఎక్కువ అవకాశం ఉంది. 
– వివేకాకు ఎవరిమీదైనా కోపం ఉందంటే వాళ్లమీదనే ఉండి ఉండాలి. 
– అందుకే ఆయన 2019 ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. 
– మా పార్టీ సీనియర్‌ నాయకుడిగా ఆయన బాధ్యత తీసుకుని ప్రచారం చేస్తున్నారు. 

రాజకీయ కుట్రతోనే ఢిల్లీలో ప్రెస్ మీట్:
– అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్యకు కారణం అవడానికి అవకాశం ఉందో వాళ్లని కాదని, ఇంట్లో వాళ్లే చేశారని ఏడాది తర్వాత ప్లేట్‌ ఫిరాయించి వాళ్లతోనే జట్టుకట్టి ఇన్నాళ్లు యుద్ధం చేస్తూ వాళ్లకే నేడు థ్యాంక్స్‌ చెప్తోంది. 
– మార్చి 15న హత్య జరిగింది. మే 30 వరకూ టీడీపీ ప్రభుత్వమే ఉంది. 
– సునీత చెప్పినట్లే హత్య కేసు సాధారణంగా వారం రోజుల్లో తేలిపోతుంది అన్నప్పుడు ఈమె మిత్రుడైన చంద్రబాబు ఎందుకు తేల్చలేదు? 
– ఆ లోగా విచారణ పూర్తి చేసి చంద్రబాబు ఎందుకు కేసు పూర్తి చేయలేదు? 
– ఆమె తలాతోక లేకుండా మాట్లాడుతుంది అనుకోవాడానికి వీళ్లేదు. పూర్తిగా ఒక రాజకీయ కుట్రతో ఢిల్లీ వెళ్లి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టారనే స్పష్టమవుతోంది. 
– ఎన్నికలు దగ్గరవుతున్నందున చంద్రబాబు ఉసిగొల్పి వేరొకరితో మాట్లాడించి తన అస్త్రాలను వాడుతున్నాడనటానికి ఇదొక ఉదాహరణ. 

కిరాతకంగా హత్య చేసినవాడు మీకు మంచోడయ్యాడా..!:
– ఆమె రాజకీయాల్లోకి వస్తే మంచిదే కదా? ఎన్నికలు 50 రోజులు ఉండగా పోలిటికల్‌ సైడ్‌ తీసుకుని ఆమె బయటకు వచ్చింది కదా.. 
– ఆమె కూడా ప్రజాకోర్టులో తేలాలి అంటుంది కదా..అదే తేలుతుంది. 
– ఏ చట్టం మాకు అప్లై కాకూడదు అనే బాపతు, దాన్ని ఆధారంగా తీసుకుని ప్రజలు జగన్‌ గారికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని వారంతా కోరుకుంటున్నారు. 
– కేసులకు ప్రజలకు సంబంధం ఏముంది? జగన్‌ గారు ప్రజలకు ఏం చేస్తామని చెప్పారో దాని ప్రకారం ప్రజల్లోకి వెళ్తున్నారు, 
– చంద్రబాబు కూడా అలానే వెళ్లాలి. లేదా వివేకా కుమార్తె సునీత వెళ్లినా అలానే వెళ్లాలి. 
– నాకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి, దానికోసం మీరు జగన్‌కు శిక్షించండి అని కోరడం విచిత్రం. 
– ప్రజలన్నా, వారి నిర్ణయం అన్నా వీరికి ఎంత అలుసుగా ఉందో అర్ధం కావడం లేదు. 
– హత్య జరిగిన విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. ఆమె కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమోననే అనుమానం కూడా చాలా మందికి ఉంది. 
– సీబీఐకి ఇచ్చిన కొన్ని వాంగ్మూలాలు లోతుగా చూస్తే అది కనిపిస్తోంది. 
– దాన్ని తప్పించుకోడానికి దొంగే దొంగ దొంగ అన్నట్లు తిప్పికొడుతున్నారేమో అనే అనుమానం కూడా వస్తుంది. 
– విచారణ జరిగితే వాటిమీద కూడా జరగాలి. 
– ఒక హంతకుడిని అప్రూవర్‌గా చేసుకుని, ఎవరైతే తన తండ్రిని ఎలా కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడో కూడా చెప్పినోడునే అక్కున చేర్చుకుని వాడిని సోదరుడు కింద చూస్తున్న వీళ్లను ఏమనాలి? 

24 సీట్లు తీసుకుని 240 సీట్లన్నట్లు మాట్లాడితే ఎలా?:
– మా దగ్గర నుంచి బయటకు వెళ్లిన వాళ్లను చంద్రబాబు తీసుకుంటున్నాడు. జనసేనలోకి తీసుకుంటున్నాడు. 
– మరి వాళ్లంతా స్మగ్లర్లు, గూండాలు కాకుండా పోయారా? 
– తిట్లు, బూతులు తప్ప ఏమీ మాట్లాడని వారి గురించి నేను మాట్లాడటం అనవసరం. 
– ముసుగులన్నీ తొలిగితే మంచిదే కదా? బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెళ్లి కలిశాడు...పవన్‌ కల్యాణ్‌ స్టేజ్‌ మీద కూడా చెప్పాడు కదా? 
– బీజేపీ వాళ్లు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కానీ చంద్రబాబు మాత్రం బీజేపీతో కలిసిపోయినట్లే ఫీల్‌ అవుతున్నాడు. 
– వాళ్ల అండ కూడా తీసుకుని, ఏదో ఒక రకంగా అర్జంటుగా కుర్చీ ఎక్కాలని తాపత్రయపడుతున్నారని ప్రజలందరికీ స్పష్టం అయిపోయింది. 
– బాషా ఒక్క సారి చెప్తే వందసార్లు చెప్పినట్లే అన్నట్లు..పవన్ కల్యాణ్ 24 సీట్లు తీసుకుని 240 సీట్లు అనుకుంటే ఎలా? 
– ఆయనేమో మాకు శక్తి లేదు..బూత్‌ స్థాయిలో భోజనాలకు డబ్బులు లేవు అంటున్న వ్యక్తి. 
– జనసేనకు 30వేల ఓట్లకు పైగా వచ్చిన 15 నియోజకవర్గాల్లో ఏడింటిని టీడీపీకి ఇచ్చాడు. 
– మిగిలినవాటిలో ఎక్కడైతే ఓడిపోతాడో అవన్నీ చంద్రబాబు..పవన్‌ కల్యాణ్‌కు ఇచ్చాడు. 
– ఆ చీటి చూస్తే అర్ధం అవుతుంది కదా? చంద్రబాబు రంగుల ఫోటో పెట్టుకున్నాడు. 
– పవన్‌కు మాత్రం మెడికల్‌ షాపు ప్రిస్కిప్షన్‌ రాసిచ్చినట్లు ఓ ఐదు సీట్లు రాసిచ్చాడు. 

చంద్రబాబు ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ జనసేనః
– చంద్రబాబుకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టుకుని వచ్చి నేను వామనవతారం, పాతాళానికి తొక్కుతా అంటే ప్రజలు నవ్వుతారని కూడా గ్రహించకపోతే ఎలా? 
– 2014లో పవన్‌ పార్టీ పెట్టాడు. పదేళ్లయింది. సమకాలీన చరిత్రలో పోలిక చూసుకోవాలి. 
– జగన్‌ గారు 2011లో పార్టీ పెట్టారు. 2014కు ముందే స్థానిక సంస్థలన్నిటిలో పోటీకి దిగారు. 
– 2014లో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టి జగన్ గారు పోటీకి దిగారు. 
– ముందుగా పవన్‌ 175 నియోజకవర్గాలకు ఇంఛార్జులను పెట్టి సీరియస్‌ నెస్‌ చూపించాలి కదా? 
– చంద్రబాబు రాసిచ్చిన స్టేట్‌మెంట్‌ చదవడం, రెండు నెలలకో, మూడు నెలలకో బయటకు రావడం తప్ప సీరియస్‌నెస్‌ ఎక్కుడుంది? 
– ఈ రోజు వచ్చి మనకు బలం లేదు.. ఎదిగే పార్టీ అని ఏడిస్తే ఎలా? 
– మమ్మల్ని తిట్టి, సినిమా డైలాగులు చెప్తే ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడో అర్ధం అవుతుంది. 
– చంద్రబాబుది వెనకా ముందుకు పోలేని పరిస్థితి. కాపు ఓట్లు తనకు కావాలి..దాని కోసం ఎల్లో మీడియాలో పవన్‌ ఇమేజ్‌ పెంచాడు. 
– దీంతో అంచనాలు పెరిగి ఆయన అభిమానులు నువ్వు సీఎం అవుతావా అని అడిగారు. 
– ఇప్పుడు ఆ ఆశ నెరవేరకపోతే ఆ ఓట్లన్నీ పోయి బూమ్‌రాంగ్‌ అవుతుందనేది ఈ రోజు కనిపిస్తోంది. 
– మేం ముందు నుంచి చెప్తున్నట్లు జనసేన అనేది చంద్రబాబు పెట్టుకున్న ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ. 
– పోనీ ఆయన్ను పార్టీలో నేరుగా పెట్టుకుంటే ఎవరూ మద్దతు పలకరు. అందుకే జనసేన ముసుగు వేశాడు. 
– వాళ్లకు సీట్ల దగ్గరే దెబ్బ పడింది. తాడేపల్లిగూడెం సభను చూశాక వారి పని క్లోజ్‌ అయిందని అర్ధం అయిపోతోంది. 
– మేం అనుకున్న టార్గెట్‌కు మేం రీచ్‌ అవుతాం. 
– నిజంగా ఆయన్ను అభిమానించే వారు పవన్‌ సీఎం కావాలని కోరుకుంటారు తప్ప చంద్రబాబు సీఎం కావాలని వారికెందుకు ఉంటుంది? 
– వారు పవన్ కల్యాణ్ పై ఆశలు పెట్టుకున్నారు. అది కాలేదు. 
– అందుకే ఆరు నెలల నుంచి పవన్‌ కల్యాణ్‌ సీట్లు ముఖ్యం కాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. 
– ఇది వాళ్లకు అప్పుడు ఎక్కలేదు. ఇప్పుడు స్పష్టంగా అర్ధమైంది. అదంతా ఇప్పుడు రిఫ్లెక్ట్‌ అవుతోంది. 

Back to Top