సీఎం వైయస్‌ జగన్‌కు సవాలు విసిరే అర్హత చంద్రబాబు లేదు

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

 గోబెల్స్‌ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా?

మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రపంచమంతా తెలుసు 

వాలంటీర్‌ వ్యవస్థ గొప్పదని మేం గర్వంగా చెబుతున్నాం

జన్మభూమి కమిటీలు అత్యుత్తమం అని చంద్రబాబు చెప్పగలరా?

చంద్రబాబుకు మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: సీఎం వైయస్‌ జగన్‌కు సవాలు విసిరే అర్హత చంద్రబాబు లేదని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గోబెల్స్‌ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా అని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి రారు కాబట్టి ఎన్ని ఛాలెంజ్‌లైనా చేస్తారని ఎద్దేవా చేశారు. సంక్షేమం చేశామని చెప్పి వైయస్‌ఆర్‌సీపీ ప్రజల వద్దకు వెళ్తుందని చెప్పారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఏం చెప్పిందని, నోటికి వచ్చినట్లు  తిట్టడం తప్ప ప్రతిపక్షం చేసింది ఏమీ లేదన్నారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతాని ప్రశ్నించారు. తాము నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్‌ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేశాం అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు.  14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు? అని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను  తాము అమలు చేశామని సజ్జల చెప్పారు.

చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గోబెల్స్‌ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా? అని ఫైర్‌ అయ్యారు. అంతిమంగా నిర్ణయించేది ప్రజలేనని అన్నారు. మీడియాలో ఊసుపోని కబుర్లతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. తాము మంచి చేశామని నమ్మితే ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నామని తెలిపారు. చంద్రబాబు సభలు ఎందుకో ఎవరికీ తెలీదని సజ్జల ఎద్దేవా చేశారు.

సిద్ధం సభలకు జనస్పందన చూస్తే సీఎం వైయ‌స్‌ జగన్‌పై ఉన్న ప్రజాదారణ అర్థమవుతుందని తెలిపారు. ఏం చూసి చంద్రబాబుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా? అని అన్నారు. చంద్రబాబు సవాల్‌కు తాము సిద్ధమేనని అన్నారు. సోమవారం సజ్జల రామకృష్ణారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..

  • చంద్రబాబు సభలు ఎందుకో ఎవరికీ తెలియదు.
  • సీఎం వైయస్‌ జగన్‌కు సవాలు విసిరే అర్హత చంద్రబాబుకు లేదు
  • 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశారు?
  • గోబెల్స్‌ ప్రచారం చేసి చర్చకు రమ్మంటే రావాలా?
  • బాబు అధికారంలోకి రారు కాబట్టి ఎన్ని ఛాలెంజ్‌లైనా చేస్తారు
  • మేం మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం
  • మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం
  • చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రపంచమంతా తెలుసు 
  • దొంగ ఓట్లు టీడీపీ చేర్పిస్తుంటే వైయస్‌ఆర్‌సీపీకి ఆపాదిస్తున్నారు
  • ప్రజలను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
  • అవినీతికి పాల్పడ్డారు కాబట్టే చంద్రబాబు జైలుకెళ్లారు
  • నారా లోకేష్‌ ఏం మాట్లాడుతున్నారో అతనికే తెలీదు
  • వాలంటీర్‌ వ్యవస్థ గొప్పదని మేం గర్వంగా చెబుతున్నాం
  • జన్మభూమి కమిటీలు అత్యుత్తమం అని చంద్రబాబు చెప్పగలరా?
  • చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు
  • రోజు ప్రభుత్వంపై రామోజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • చంద్రబాబు అధికారంలోకి రారని రామోజీకి కూడా తెలుసు
  • చంద్రబాబుకు తెలిసింది మోసం చేయడం ఒక్కటే
  • అధికారంలోకి రారని తెలిసి అడ్డగోలుగా హామీలిస్తున్నారు
  • చంద్రబాబుకు మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం
  •  
Back to Top