తాడేపల్లి: ఐటీ శాఖ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబు తీరు దొంగతనం చేసి దబాయిస్తున్నట్లుగా ఉందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అవినీతి బండారం బయటపడటంతో ఆయనకు భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోందని, అడ్డంగా దొరికిపోయినట్లు ఆయనకే అర్థమవుతోందని చెప్పారు. అందుకే గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆదాయపన్నుశాఖ నోటీసులతో చంద్రబాబుకు భవిష్యత్తు అర్ధమైనట్లు ఉందని....అరెస్ట్ చేస్తారని చంద్రబాబు స్మెల్ చేసి తనను రెండు మూడు రోజులలో అరెస్ట్ చేస్తారంటూ నానారాధ్దాంతం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యవహారం చూస్తే దొంగతమనం చేసిన వ్యక్తి దబాయించినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి వ్యవహారాలకు రుజువులు ఉన్నాయని ఇప్పటికి వరకు తాము చెబుతూ వస్తున్న అంశాలు నిజమయ్యాయని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై దగ్గుబాటి పురంధేశ్వరి చిన్నవిషయంగా పేర్కొనడం అభ్యంతరకరం అన్నారు. దొంగతనాన్ని సాధారణం అంశంగా చూస్తున్న పురంధేశ్వరి తీరు చూస్తుంటే మరిదిని రక్షించాలన్న ఆమె ఎత్తుగడ అర్థం అవుతుందన్నారు. చంద్రబాబును వెనకేసుకురావడంగాను..లేదా మధ్దతు ఇవ్వడం కిందకు ఇది వస్తుందన్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే చంద్రబాబుకు ఐటినోటీసులపై దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం...కమ్యూనిస్టులు కూడా ఇంకా నోరు మెదకపోవడం దారుణమన్నారు. ఈనాడు,ఆంధ్రజ్యోతిలలో చంద్రబాబుకు ఐటీ నోటీసుల విషయం కనీసంగా రాయకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఐటి ముడుపుల కేసులో దోషి అని తేలితే శిక్ష తప్పదని అన్నారు.చంద్రబాబు నిప్పు కాదు తుప్పులాంటి వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబుకు ఐటి నోటీసుల వెనక వైయస్ఆర్‌సీపీ ఉందని తెలుగుదేశం నేతలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు తేల్చింది ఐటీ శాఖ అని అదికూడా కొన్ని సంవత్సరాలపాటు ఆధారాలు సేకరించిన తర్వాత నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. దీనికి చంద్రబాబు కూడా ఆదాయపన్ను శాఖకు పలుమార్లు లేఖలు రాసిన విషయం కూడా ఆ నోటీసులలో ఐటి అధికారులు స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబును ఏదైనా కేసులో ఇరికించాలనే ఆలోచన మాకు లేదు. లేకుంటే వైయస్ జగన్ అధికారంలోకి రాగానే మేము కేసులు పెట్టి లోపలేయించే పనిచేసేవాళ్లం. ఆ అవసరం మాకు లేదు. అమరావతి అభివృధ్ది పనులకు సంబంధించి సెక్రటేరియట్,టిడ్కో ఇళ్ల నిర్మాణం,స్కిల్ డెవలప్ మెంట్ లో కుంభకోణాలకు సంబంధించి షాపుర్జీ,పల్లోంజీ సంస్ధకు చెందిన డాక్యుమెంట్లలో ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చింది ఐటీ జారీచేసిన నోటీసులలో వివరంగా ఉందన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం ఇచ్చిన రేటు అత్యంత అవినీతిమయం. హేయం. 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్ట్ ఏకంగా రూ. 600 కోట్లకు పైగానే. అంటే ఒక్కో చదరపు అడుగుకు రూ. 10 వేలకు పైగా చెల్లించారు.ఇంకా పేదల ఇళ్ల (టిడ్కో) నిర్మాణంలో చదరపు అడుగుకు రూ. 2200 చొప్పున ఇచ్చారు. నిజానికి అప్పట్లో ఆ ఇంటి నిర్మాణంలో ఎస్‌ఎఫ్‌టీకి రూ. 1000 కి మించి కాదు. కానీ పేదల జేబు కొట్టి.. వారిని కూడా దోచుకున్న ప్రభుత్వం చంద్రబాబుది. పేదలు తమ ఇంటి కోసం అప్పు చేస్తే.. దాన్ని వారు 20 ఏళ్ల పాటు తిరిగి చెల్లించేలా చేశారు. అలా రాజధానిలో నిర్మాణాలు, నిరుపేదల ఇళ్ల (టిడ్కో)లోనూ చంద్రబాబు దుర్మార్గమైన అవినీతి ఆరోజు అందరికీ తెలిసినా.. ఇప్పుడు ఆ ఆధారాలు బయట పడ్డాయన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలుగాని,చంద్రబాబు గాని ఆదాయపన్ను శాఖ నోటసులకు గాని స్పందించకుండా వైయస్ఆర్‌సీపీపై, వైయస్ జగన్ గారిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నిజానికి చంద్రబాబు ఏ నేరం చేయకపోకపోతే ముడుపులు తీసుకోకపోతే ఆ విషయాన్ని ఆదాయపన్ను శాఖకు వెళ్లి చెప్పాలన్నారు. అలా కాకుండా తనను అరెస్ట్ చేయవచ్చు అంటూ దోపిడీ చేసి, తాను నిజాయితీ పరుడైనట్లు చిత్రీకరించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు. మాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం అవినీతి విషయంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును ఇప్పటికే ఈడీ కూడా విచారణ జరిపి అరెస్టు కూడా చేయాల్సింది. కానీ ఇంతకాలం ఎందుకు చూస్తూ ఊరుకుందో మాకు అర్థం కావటం లేదు అని అన్నారు. ముడుపులన్నీ ఎటుఎటు తిరిగి చంద్రబాబు గూటికి చేరాయో ఐటీ శాఖ వివరంగా ఆ నోటీసుల్లో పేర్కొందన్నారు. తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు అని ఆయన పాపం పండినప్పుడు చంద్రబాబును అరెస్టు చేయటం ఖాయం అని అన్నారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చడమే కాక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై బురద జల్లడమే ఎల్లోమీడియా విధానం అని విమర్శించారు. అందుకే అటు చంద్రబాబుగాని ఇటు పచ్చమీడియా,పవన్ కల్యాణ్,కమ్యూనిస్టులు ఐటీ నోటీసులపై నిశ్శబ్ధాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తోందని తెలియచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించి సానుభూతి పొందాలనేది చంద్రబాబుకు అలవాటు అన్నారు. పుంగనూరు, భీమవరంలలో అదే జరిగిందన్నారు.నిజానికి రాష్ర్టంలో వైయస్ జగన్ పాదయాత్ర సమయంలో తెలుగుదేశం శ్రేణులు పసుపునీళ్లతో,పేడ నీళ్ళతో ఆయా రోడ్లను శుభ్రం చేసి రెచ్చగొట్టేప్రయత్నం చేసినా తాము చాలా సంయమనం పాటించామన్నారు. నేడు చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్టులపై యాత్ర చేసినప్పుడు అంగళ్ళు,పుంగనూరు లలోను,నిన్న లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న యాత్రలోను శాంతిభధ్రతలకు విఘాతం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని అన్నారు. పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారని లోకేష్ యాత్రలో అయితే టిడిపి కార్యకర్తలు రాళ్ళు విసురుతూ దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. మీడియా కూడా ఈ విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాలని కోరారు. చంద్రబాబు తనకు ఇబ్బంది ఎదురైన ప్రతిసారి ప్రజలంతా తనకు అండగా నిలబడాలని డ్రామాలు ఆడుతుంటాడని...ఆయన అవినీతికి పాల్పడి కూడా ప్రజలు తనను రక్షించుకోవాలని చెప్పడం అతని నైజం అన్నారు.ఇంకా తాను ఇబ్బందుల్లో ఉంటే జనాన్ని రెచ్చగొట్టటం చేస్తుంటాడని అన్నారు. ప్రజలనుంచి సానుభూతి పొందాలనే ప్రయత్నాలలో చంద్రబాబు ఉన్నారన్నారు. ఓటర్ కార్డు ఆధార్ కు లింక్ చేయాలనే అంశానికి వైయస్ఆర్‌సీపీ పూర్తి మధ్దతు ఇస్తుందన్నారు.తాము ఈవిషయంలో గతంలో అంటే చంద్రబాబు 2018 సమయంలో బోగస్ ఓట్లను చేర్చిన సమయంలోనే ఎన్నికల కమీషన్ కు ఈ విషయాన్ని తెలియచేశామని వివరించారు. మా పార్టీ ఓటర్ లిస్ట్ తో ఆధార్ ను లింక్ చేయడాన్ని సమర్ధిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జమిలీఎన్నికలు...ఇండియాను భారత్ అని మార్చడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సజ్జల తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించారు. ఈ రెండు అంశాలపై పార్టీ అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షులు,ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలియచేస్తారని వివరించారు. నా అబిప్రాయంగా చెప్పాలంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి మరింత విస్ర్తుతస్దాయి చర్చ జరగాల్సి ఉందని అన్నారు. వన్ నేషన్. వన్ ఎలక్షన్. మొదట్లో అలాగే జరిగాయి. ఆ తర్వాతే పరిస్థితి మారింది. జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిన తర్వాత.. రాష్ట్రాల్లో పూర్తిస్థాయ ప్రభుత్వాలు కొనసాగక, ఎన్నికల షెడ్యూల్ మారింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. అన్ని సమస్యలకు జమిలి ఎన్నికలే పరిష్కారం అనుకోవడం కూడా సరికాదు ఇంకా పూర్తి స్దాయి క్లారిటీ రావాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించి సంబంధించి అనేక ప్రశ్నలు జమిలీ ఎన్నికల విధానం ద్వారా వస్తాయన్నారు. వాటికి సమాధానం రావాల్సి ఉందన్నారు. అదే విధంగా ఇండియా పేరును భారత్ గా మార్చడం ద్వారా ప్రయోజనం ఉంటుందని అనుకోవడం లేదు. ప్రజలకు అడ్వాండేజ్ వస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. ఆ రెండు పేర్లు బాగానే ఉంటాయి. చర్చ అనవసరం అని భావిస్తున్నాను. చర్చ జరగాలని కూడా నేను కోరుకోవడం లేదన్నారు. ప్రపంచం అంతా ఇండియా అనే చూస్తోంది. మనం భారతదేశం అని పిలుచుకుంటాం అని తెలియచేశారు.