తాడేపల్లి: కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమాయకుల ప్రాణాలు బలికావడానికి చంద్రబాబే కారణమన్నారు. కందుకూరులో నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదన్నారు. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. పోలీసు యాక్ట్‌కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ నిర్ణయం అన్ని పార్టీలకు వర్తిస్తుంది. జీవోను ఉల్లఘిస్తామని టీడీపీ ఛాలెంజ్ చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించడం సబబు కాదని సూచించారు. కుప్పానికి చంద్రబాబు దండయాత్రలా బయల్దేరారు. సభలు పెట్టుకోవద్దని చంద్రబాబుకు ఎవరూ చెప్పలేదన్నారు. ఇరుకైన ప్రాంతాల్లో మాత్రమే సభలు వద్దని కుప్పంలో చంద్రబాబుకు పోలీసులు సూచించారని చెప్పారు. చంద్రబాబు పోలీసుల పట్ల బెదిరింపు దోరణికి దిగారని తప్పుపట్టారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కుప్పంపై చంద్రబాబు దండయాత్ర: -తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబునాయుడు చేసిన మానవ తప్పిదం వల్ల జరిగిన దుర్ఘటనల్లో 8 మంది కందుకూరులో, గుంటూరులో ముగ్గురు చనిపోయారు -దాని తర్వాత ఒక బాధ్యత కలిగిన వ్యవస్థగా ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం భావించింది. -ప్రజల ప్రాణాలను హరించేంతగా రిస్క్ ఉండటం వల్లే రోడ్లపై సభలు కరెక్ట్ కాదు అని జీవో ఇచ్చింది -ఏ రాజకీయ పార్టీ అయినా రోడ్లపై సభలు పెట్టొద్దు...ప్రత్యామ్నాయ స్థలాల్లో సభలు పెట్టుకోవాలని సూచించింది -అపోహలకు తావు లేకుండా సుధీర్ఘ వివరణతో ప్రభుత్వం జీవో తెచ్చింది -ఈ ప్రభుత్వం తెచ్చిన జీవోకు కట్టుబడి ఉండేది లేదు..ఉల్లంఘిస్తాం అంటూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఛాలెంజ్ చేస్తున్నారు. -ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రభుత్వ జీవోను చాలెంజ్ చేస్తూ నేరుగా కుప్పం మీదకు దండయాత్రకు వెళ్లాడు -దానికి చంద్రబాబు ఎన్ని భాష్యాలు చెప్పినా, రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉటంకించినా జరిగిన ఘోరాన్ని, చేసిన తప్పును తప్పించలేవు -ఎన్ని విమర్శలు చేసినా.. జీవో యొక్క ఉద్దేశాన్ని తగ్గించలేవు..పైగా పెంచుతాయి కూడా -ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలకు, జరిగిన మారణకాండకు సిగ్గుతో తలదించుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సింది -నైతికంగా నేను బాధ్యత వహిస్తానని చెప్పాల్సిన పెద్ద మనిషి ..తనకు కనీస సంస్కారం కూడా లేదని, తానొక ఉన్మాదిని, తనది రాక్షస సంస్కృతి అంటూ చెప్పుకొస్తున్నాడు -వ్యవస్థలన్నిటినీ నా కాలు కింద వేసుకుని తొక్కుతానంటూ చొక్కాలు చించుకుని, రొమ్ము విరుచుకుని ప్రతిపక్ష నాయకుడు కుప్పం వీధుల్లో ప్రదర్శనలు ఇస్తున్నాడు -ఏ ప్రభుత్వాలైనా జరుగుతున్న పరిణామాలను బట్టి కావాల్సిన చర్యలు, నిర్ణయాలు తీసుకుంటాయి -వాళ్లు చీకటి జీవో అంటున్న ఈ జీవో.. అవసరమా లేదా అనేది నేను ప్రజల్ని మేము అడుగుతున్నాం..ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం -ఏరోజుకా రోజు టీడీపీ రాజకీయ ఎజెండా ఫిక్స్ చేసే పచ్చ మీడియా ఈరోజు ఎజెండా చైతన్య రథం -అసలు ఎందుకొచ్చింది ఈ పరిస్థితి..? చంద్రబాబు తనకు తాను ఒక సంక్షోభం సృష్టిస్తాడు కందుకూరు మారణకాండకు బాబు సభాస్థలే కారణం కాదా..?: -ప్రభుత్వం తెచ్చిన చట్టం ఎందుకు వద్దు అనేది చంద్రబాబు చెప్పాలి..ఎక్కడంటే అక్కడ సభలు పెట్టుకుందామా..?, ప్రజల ప్రాణాలో పోయినా ఫర్వాలేదా? - కందుకూరులో మర్యాదగా సభ జరిగిందా..? అలా జరిగి ఉంటే..నువ్వు నిలపాల్సిన చోట వాహనం నిలిపి ఉంటే ఆ మారణకాండ జరిగి ఉండేదా..? -అక్కడ అమాయకపు ప్రాణాలు పోయాయే..పోలీసులు అనుమతి ఇచ్చిన చోటే చంద్రబాబు తన వాహనం ఆపి ఉంటే అది జరిగేదా..? -రోడ్లమీద జరిగే ఇలాంటి సభల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. -అది టీడీపీ కానీ, వైయస్ఆర్‌సీపీ , జనసేన లాంటి ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు -దానిని సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి చేయాలా వద్దా..? -అందుకే ఆ జీవో తెచ్చాం. ఏ మాత్రం వివేకం ఉన్నా ఇది మంచి నిర్ణయం అంటున్నారు -దానికి మేం కూడా కట్టుబడి ఉండాలి. మాకు కూడా సులభమే. -జగన్మోహన్‌రెడ్డి గారి వెహికల్ కూడా ఎక్కడంటే అక్కడ ఆపితే మాకూ లాభమే...కానీ రిస్క్ ఉంటుంది. ఎవరైనాసరే.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకూడదన్నదే ఆ జీవో ఉద్దేశం. కుప్పంలో సభ ఎక్కడ పెట్టుకుంటారో కూడా టీడీపీ చెప్పలేదు: -అందుకే ఈ కట్టుబాటుకు వైయస్ఆర్ సీపీ కూడా లోబడే ఉంటుంది. ఉండక తప్పదు -కానీ చంద్రబాబు నేను ఉల్లంఘిస్తాను..ఏం చేస్తారో చూస్తాను అంటున్నాడు -కుప్పంలో టీడీపీ వారు అక్కడి డిఎస్పీకి చంద్రబాబు పర్యటన గురించి ఒక వాట్సప్ మేసేజ్ పెట్టారు..దానికి డిఎస్పీ రిప్లై ఇచ్చారు -అందులో సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలులో ఉంది...దాని ప్రకారం సభలు, సమావేశాలు ఎక్కడ పెడతారో ముందస్తు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ చెప్పారు -కొత్తగా ఒక జీవో వచ్చింది...అందువల్ల సభలు జరపాలంటే ఎక్కడ జరుపుతారో చెప్తే దానికి అనుమతులు ఇస్తాము అని డిఎస్పీ చెప్పారు -సెక్షన్ 30 ప్రకారం ర్యాలీలకు అనుమతి తీసుకోవాలని చూడా చెప్పారు -చంద్రబాబుకు అనుమతులు తీసుకోవడానికి ఏంటి ఇబ్బంది..? గెరిల్లా వార్ ఫేర్ లా చేయాలనుకుంటున్నాడా..? -చట్టానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నారా..? చట్టం వెలుపల ఉండాలి అనుకుంటున్నారా..? -నేను చట్టాన్ని ఉల్లంఘిస్తాను..నేను తుంటరిగానే ప్రవర్తిస్తాను అని చంద్రబాబు అంటే పోలీసులు తమ పని తాము చేసుకుపోతారు. -చంద్రబాబు ఒక ప్రతిపక్ష నాయకుడు, సిఎంగా చేశారని అక్కడ డిఎస్పీ ఎంతో వినమ్రంగా సమాధానం చెప్తూనే ఉన్నాడు -రోడ్ల మీద వద్దన్నారు...పక్కనపెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు అని కూడా చెప్పారు -పలానా చోట సభ పెట్టుకుంటాం అని టీడీపీ వారు చెప్పి ఉంటే అక్కడ సమస్యే ఉండేది కాదు -మైక్ పర్మిషన్ రిజెక్ట్ చేశారు కాబట్టే వాహనం తీసుకెళ్లారు. దానికి కారణం ఈయన ఎక్కడ సభ పెట్టుకుంటాడో కూడా చెప్పలేదు..అనుమతి తీసుకోలేదు -ఇవేమీ చేయకుండా నా ఇష్టారాజ్యం నేను ఎక్కడైనా కూర్చుంటా..నేను ఏమైనా చేస్తాను అంటున్నాడు చంద్రబాబు. చంద్రబాబును ఎవరూ అడ్డుకోలేదు: -ఆయన చేస్తున్న హూంకారాలు చూస్తే ఆయన మానసిక సమతుల్యత తప్పనట్లు కనిపిస్తోంది -చొక్కాలు చించుకుని, కిందపడి దొర్లడం వంటి విద్యలన్ని రాజకీయ నటుడిగా చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య -కుప్పం వెళ్లి చంద్రబాబు మూడు రోజులు పర్యటన చేసుకోడానికి ఆయనకు ఎవరూ ఎలాంటి ఇబ్బంది క్రియేట్ చేయలేదు -రోడ్ షోలు చేశాడు...తిరగడం అన్నీ చేశాడు..ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు -చంద్రబాబు రోజూ తిరుగుతూనే ఉన్నాడు...వాళ్ల పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూపిస్తూనే ఉన్నారు -ఈ రోజు మా నాయకులు ఏదో చేశారు అంటూ రాతలు రాస్తున్నారు -మరి రెండు రోజులుగా చంద్రబాబు కుప్పంలో తిరుగుతుంటే ఎవరూ అడ్డుకోలేదే..? -ఈ రోజు నా బండి ఇవ్వండి అంటూ రోడ్డుపైనే కూర్చున్నాడు కూడా -ఆయన చేసేవి ఏవీ ఆపలేదే..? ఎలా చేయగలుగుతున్నాడు..? కుప్పం ప్రజలకు చేసింది చెప్పుకోలేకే ఇన్ని డ్రామాలు: -చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గానికి కూడా చేసింది ఏమీ లేదు. అందుకే చెప్పడానికి ఏమీ లేక ఇన్ని డ్రామాలు ఆడుతున్నాడు. -మా నాయకుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తాననన్న దానికి మించి చేశాడు. -అట్టడుగు వర్గాల హృదయాల్లోనూ మా నాయకుడే ఉన్నాడు...కుప్పం ప్రజలు కూడా జగన్మోహన్‌రెడ్డిగారికి మద్దతు పలుకుతున్నారు -అందుకే మొన్నటి పంచాయితీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలన్నిటిలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కుప్పం ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు చంద్రబాబును జనం పట్టించుకోవడం లేదు: -ఓపెన్ ప్లేస్‌లో మీటింగు పెడితే జనం రారని, రోడ్డు మధ్యలో పెడితే కాస్త జనం గుమిగూడతారని, వాళ్లు తన కోసమే వచ్చారని చెప్పుకోవచ్చని చంద్రబాబు ప్లాన్ వేశాడు -అందుకే నేను అక్కడే సభ పెడతాను అంటూ భీష్మించుకు కూర్చున్నాడు -అలా చేయబోయే కందుకూరులో 8 మందిని పొట్టనపెట్టుకున్నావు మహానుభావా అని మేం చెప్తున్నావ్ -డ్రోన్ షాట్ల కోసం సందుల్లో- గొందుల్లో సభ పెట్టి తనకు పెద్ద పాపులారిటీ ఉందని చూపించుకునేందుకు చేసిన దాని వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు -ఇలాంటి దుందుడుకు, నిర్లక్ష్యపు వైఖరితో ఏ రాజకీయ నాయకుడైనా చేయకుండా ఆ జీవో వచ్చింది బాబు ముందు గాయాలు, కట్లు ప్రదర్శన.. వెళ్ళాక అన్నీ మాయం: -కుప్పంలో ఏమీ జరగకపోయినా నిన్న గాయపడ్డారని ఆస్పత్రికి వెళ్లి పరామర్శకు వెళ్లి డ్రామా చేశాడు -చంద్రబాబు అక్కడకు వెళ్లడానికి ముందు బాగానే ఉన్న వారు ఆయన వచ్చే సరికి సీన్ మారిపోయింది -అక్కడున్న ఒక యువకుడు బాబు వచ్చే వరకూ బాగానే ఉన్నాడు...ఆయన వచ్చేసరికి తలకు, చేతికి కట్టువచ్చింది -చంద్రబాబు వెళ్లిపోగానే వారి బెడ్లు అన్నీ ఖాళీ అయ్యాయి. -ఇంత దిక్కుమాలిన ఆలోచనలు, నాటకాలు బహుశా ఇప్పుడున్న సమకాలీన సమాజంలో చంద్రబాబు తప్ప ఎవరూ చేయలేరు -మరి ఇవి రామోజీరావు, రాధాకృష్ణ ఇచ్చే సలహాలా..? లేక చంద్రబాబు సహవాసంలో వాళ్లే ఇలా చేస్తున్నారా అనేది అంతుబట్టడం లేదు -స్ట్రైక్ అంటే రెండు బస్సులన్నా పగలాలి అని చంద్రబాబు అనేవాడని దగ్గుబాటి గారు గతంలో తన పుస్తకంలో రాశారు -ఇలాంటి ఆలోచనలు పుట్టుకతోనే చంద్రబాబుకు ఉండి...దాని ద్వారా రాజకీయం చేయవచ్చు అనే స్థిరమైన నిర్ణయంతో ముందుకు వెళ్తున్నట్లున్నాడు ర్యాలీలు, రోడ్ షోలు నిషేధం అని ఆ జీవోలో చెప్పలేదే..: -ఆ పత్రికలు, చానళ్లు ఇర్రెస్పాన్సిబుల్ అఫిషియల్ మీడియా ఆఫ్ తెలుగుదేశం పార్టీ...చంద్రబాబునాయుడు -రాజకీయ పార్టీలకు పత్రికలు ఉండొచ్చు...వామపక్షాలకు వాళ్ల పత్రికలు కూడా ఉన్నాయి..మాకు సాక్షి ఉంది... -సాక్షిలో రాసేటప్పుడు బాధ్యతగా ఉంటాం..చంద్రబాబు జగన్ గారిని తిట్టినా దాన్ని కూడా మేం వేస్తాం...జగన్ గారిపై చేసిన విమర్శలకు సమాధానం కూడా ఇస్తాం -కానీ ఆ పత్రికలు అవన్నీ వదిలేశాయి...ఒక వక్రీకరించిన చిత్రాన్ని ప్రజల ముందు పెడుతున్నాయి -ఈ వారం పదిరోజుల్లో జరిగిన ప్రధాన అంశాలు గమనిస్తే.. అన్యాయంగా ఒక పెద్ద పోలిటికల్ పార్టీ తెలుగుదేశం వల్ల 11మంది చనిపోయారు అనేది వాస్తవం -ఆ తర్వాత జీవో వచ్చింది-ఆ జీవోలో ర్యాలీలు, రోడ్ షోలు నిషేధం అని ఎక్కడైనా అన్నారా..?: -కందుకూరు దుర్ఘటన తర్వాత ప్రభుత్వం సమీక్షించుకుని రోడ్లమీద సభలు జరగడం వల్ల ఉండే రిస్క్‌లను గుర్తించింది -ప్రత్యామ్నాయ స్థలాలను పోలీసులు సూచించాలి. లేదా అర్గనైజర్లు అయినా స్థలాలు చూపించవచ్చు -మీ అంతట మీరు ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదంటూ చెప్పడం సరికాదు -చంద్రబాబు ఈ రెండు రోజుల నుంచీ చేస్తున్నది ర్యాలీలు, రోడ్ షోలే కదా -ఆ జీవోలో ఎక్కడైనా ర్యాలీలు, రోడ్ షోలు నిషేధం ఉందా చూపించండి -సెక్షన్ 30 అక్కడ ఉంది కాబట్టి సమావేశం గురించి సరైన సమాచారం ఇవ్వలేదు కాబట్టే మైక్‌సీజ్ చేశారు. -నిజంగాచంద్రబాబు చట్టాన్ని గౌరవించే వ్యక్తి అయితే...చట్టానికి లోబడే సంస్థ టీడీపీ అయితే వీరు రిక్వెస్ట్ చేస్తే ఎందుకు అనుమతి ఇవ్వరు..? -వాళ్లు ఇవ్వకపోతే అప్పుడనొచ్చు...మేం కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది -అవేమీ చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఆయనే చొక్కా చింపుకుని, నేలమీద పడి దుమ్ములో దొర్లిదొర్లి, నన్ను కొట్టారు అన్నట్టుగా నానా యాగీ చేస్తున్నాడు కుప్పంలో చంద్రబాబు చేసినవి రోడో షో లే కదా..: -ఈ మూడు రోజులు చంద్రబాబు అక్కడ రోడ్ షో చేస్తూనే ఉన్నాడు..క్రేన్‌లతో ఆయనకు దండలు కూడా వేస్తూనే ఉన్నారు...ఇక మేం అడ్డుకున్నదేముంది -చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా ఉంది..ఆ కోణంలో చూసినా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి కదా... -నువ్వు చేసిన పనివల్ల గుంటూరులో ముగ్గుర్ని బలితీసుకున్నారు. తీరా ముగ్గురు చనిపోతే నేను చుట్టపు చూపుగా వచ్చాను అంటాడు -వాస్తవాలను బయటకు తీస్తే టీడీపీ నేతలే అనుమతుల కోసం దరఖాస్తు చేశారు -ఎవర్ని మోసం చేయాలని ఇన్ని డ్రామాలు చేస్తున్నావ్ చంద్రబాబూ..? -గుంటూరులో పోలీసులు హెల్ప్ చేయబట్టే అక్కడ మరణాలు తగ్గాయి. -నేను లీడర్...14 ఏళ్లు సిఎం అని రొమ్ము విరుచుకుని చెప్పుకుంటావ్ -కుప్పంలో నిన్ను పోలీసులు అడ్డుకుంటున్నారు అన్న మాట ఆబద్ధం కాదా..? పోలీసుల సూచనల మేరకే జగన్ గారి మీటింగులు: -మొన్నటికి మొన్న మా మీటింగు కర్నూలులో రాజ్ విహార్ సెంటర్లో పెట్టాలని ప్రతిపాదన వస్తే ఇరుకు రోడ్డని మేమే వద్దని చెప్పాం..అప్పటికీ ఈ జీవో కూడా లేదు -జగన్ గారి పర్యటనలకు సంబంధించి ప్రతి సారీ పోలీసులకు సమాచారం ఇస్తున్నాం. -వారి సూచనల ప్రకారం కొన్ని సందర్భాల్లో సభల స్థలాలను కూడా మార్చుకున్నాం -నిజంగా చంద్రబాబు పార్టీపై అభిమానం ఉన్న వాళ్లు.. ఏదైనా స్థలంలో పెట్టినప్పుడు అక్కడ వరకూ కూడా రాలేరా..? -ఏదైనా జరిగితే.. అప్పుడు ఇంత జరుగుతున్నా మీ ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నించరా...? కోర్టు ఏం చెప్పిందో కానీ...ఆ పత్రికలు మాత్రం నిప్పులు చెరిగాయి: -సలహాదారులకు సబంధించి కోర్టు ఏం చెప్పిందో నాకు తెలియదు... -ఆ పత్రికలు మాత్రం నిప్పులు చెరిగారు అంటూ రాసుకొచ్చారు -న్యాయ వ్యవస్థ...ఎగ్జిక్యూటివ్ వ్యవస్థపై బాస్ కాదు...అలా అని ఉంటారని కూడా నేను అనుకోవడం లేదు - వాళ్ల రాతలు చూసి రియాక్ట్ కాలేము. వాళ్లు నోటికొచ్చినట్లు రాసేస్తున్నారు -ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఇండిపెండెంట్. ఎగ్జిక్యూటివ్ లో కూడా ఈ మధ్య కాలంలో సంక్లిష్టత పెరిగింది. దానికి అనుగుణంగా నిపుణుల అవసరం కూడా ఉంటుంది. - ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ విధానాలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమర్ధంగా ఉండేందుకు సలహాదారులను పెట్టొచ్చు. -కేంద్రంలో కూడా పెడుతన్నారు..చంద్రబాబు హయాంలో కూడా పెట్టారు. - చంద్రబాబు హాయంలో కన్సల్టెంట్ అనే పేరుతో వందల కోట్లు దోచేశాడు...జగన్‌గారు అవసరాన్ని బట్టి సలహదారులను పెడుతున్నారు. - చేసిన మంచి చెప్పుకోడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదు...జగన్ గారిని ఎత్తిచూపడానికి వారి వద్ద ఏమీ లేదు. -అందుకే ప్రాధాన్యం లేని ఇలాంటి అంశాలన్నిటినీ బయటకు తీసుకువస్తున్నారు..దాని ద్వారా శునకానందం పొందుతున్నారు - సలహాదారులు ఉండాలా లేదా..? దాని రాజ్యాంగ బద్ధత ఏమిటీ అని పరిశీలించే హక్కు న్యాయ వ్యవస్థకు ఎప్పుడూ ఉంటుంది. -అదే సమయంలో ప్రభుత్వం అనేది ఎవరికీ సబార్డినేట్ కూడా కాదు. ప్రభుత్వం జవాబు ఇవ్వాలంటే శాసనవ్యవస్థకు ఇవ్వాలి... -ఒక వేళ నియమాలకు విరుద్ధంగా చేస్తే కోర్టులు ప్రశ్నిస్తాయి. -ఒక వ్యవస్థ తీసుకున్న నిర్ణయం.. అన్నీ ఆలోచించే తీసుకుని ఉంటుందని నమ్మకంతో వ్యవస్థల మధ్య సంబంధాలు ఉండాలి. - అలా కాకుండా నేనేదైనా కామెంట్‌చేయవచ్చని ఎవరైనా అన్నా నష్టమే జరుగుతుంది. రాజ్యాంగం ఆశించిన సమన్వయం కూడా దెబ్బతింటోంది. చంద్రబాబు దగ్గర సరుకు లేదు కాబట్టే : -వైయస్ఆర్ సీపీని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు రంకెలు వేస్తున్నాడు..తాను ఏం చేశానో చెప్పి...మేం ఏం చేయలేకపోయామో చెప్పుకుని ప్రజల వద్దకు వెళ్లాలి -అమరావతి దగ్గర నుంచి ప్రతిదానిలో చంద్రబాబు ఒక వర్చువల్ ప్రపంచంలో బతుకుతున్నాడు...దానితోటే గోదారిని ఈది అవతలకు వెళ్లాలని చూస్తున్నాడు -అది చీకటి జీవో కానేకాదు...ప్రజలకు ఇబ్బందులు తొలగించే వెలుగునిచ్చే జీవో -దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయన న్యాయస్థానాలకు కూడా వెళ్లొచ్చు..అప్పుడు ఎందుకు ఈ జీవో తేవాల్సి వచ్చిందో కూడా ప్రజలు నిత్యం మాట్లాడుకుంటూనే ఉంటారు