వైయస్‌ జగన్‌ పాలనలోనే సామాజిక న్యాయం

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

మేం బీసీ డిక్లరేషన్‌ పెట్టినప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయి

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత

విద్య ద్వారా సాధికారత సాధ్యమని వైయస్‌ఆర్‌ నమ్మారు

 అందుకే ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు

ఎంబీసీలు నేడు తమ ఉనికి నిలబెట్టుకున్నారు

బీసీల సాధికారతకు ఆనాడు వైయస్‌ఆర్‌ హయాంలో తొలి అడుగు పడింది

 నేడు వైయస్‌ఆర్‌ బాటలోనే సీఎం వైయస్‌ జగన్‌ నడుస్తున్నారు

తాడేపల్లి: సామాజిక న్యాయం అనే మాటకు కట్టుబడి అమలు చేసిన ఘనత వైయస్‌ఆర్‌సీపీకే దక్కుతుందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ పాలనలోనే బీసీలకు సాధికారత సాకారమైందని చెప్పారు.  బీసీల సాధికారతకు ఆనాడు వైయస్‌ఆర్‌..ఈనాడు వైయస్‌ జగన్‌ న్యాయం చేశారన్నారు. తాడేపల్లిలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించారు. 
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..ప్రజలకు అతిముఖ్యమైన వాటిలో విద్యా, వైద్యం అన్నారు. ఇవి కాక మిగిలినవి చాలా ఉన్నాయి. విద్య, వైద్యం అన్నది ప్రజలకు వారి కాళ్లపై వారు నిలబడేలా సపోర్టు చేస్తాయి.  నా నిర్ణయాలు నేనే చేసుకోగలను అని ఈ రెండు నిరూపిస్తాయి. విద్య ద్వారా సాధికారత సాధ్యమవుతుందని ఆ రోజు వైయస్‌ఆర్‌ నమ్మారు. అందుకే వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైద్యం ఖరీదైన రోజుల్లోపేదలకు ఆపన్న హస్తం అందించిన నేత వైయస్‌ఆర్‌కే దక్కుతుంది. స్వాతంత్య్రం వచ్చాక ఎస్సీ రిజర్వేషన్లు పెట్టారు. ఆ తరువాత మండల్‌ రిపోర్టును వీపీ సింగ్‌ తీసుకువచ్చిన తరువాత ఆ రోజు దాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకించినా ఎదురు నిలబడి ఆ వర్గాలకు అండగా నిలిచారు. ఆ తరువాత కొన్ని వర్గాలు తోడుగా నిలవడంతో ఎంబీసీలు ఎస్సీల కంటే ఏరకంగానూ మెరుగైన పరిస్థితి లేని కొన్ని జాతులు ఉన్నాయి. పేరు కూడా తెలియని కులాలు ఉన్నాయి. అలాంటి వారు ఈ రోజు ఉనికి నిలబెట్టుకోవడమే కాకుండా సొంత కాళ్లపై నిలబడుతున్నారు. సమాజానికి తోడుగా నిలబడి పోరాటాలకు సిద్ధపడుతున్నారు. ఈ మార్పులు జరుగుతున్న క్రమంలో మేలి ముందడుగు మాదిరిగా స్వాతంత్య్రం వచ్చిన అనేళ్ల తరువాత బీసీల మొత్తాన్ని ముందుకు తీసుకురావడానికి, నిజమైన సాధికారత దిశగా అడుగులు వేయించడానికి నాడు వైయస్‌ఆర్‌హయాంలో తొలి అడుగు పడితే.. మన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన సంస్కరణలు, పథకాలు, ఆయన ఆలోచన విధానాలతో పదేళ్లలో అవుతుందనుకున్న సాధికారత మూడేళ్లలోనే చేసి చూపించారు. మా ప్రభుత్వంలో 70 నుంచి 80 మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలే ఉన్నారు. గతంలో ఇంత మంది పదవుల్లో ఉండేవారు కాదు. రిజర్వేషన్‌ ప్రకారమే గతంలో పదవులు ఇచ్చేవారు. కానీ ఈ రోజు ఇందుకు భిన్నంగా అన్ని వర్గాలు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కూర్చున్నారు. బీసీల్లో సంఖ్యాపరంగా కొందరు ముందుండి పోరాడి పదవుల్లో ఉన్నారు. కానీ మా ప్రభుత్వంలో చాలా మంది బీసీలు నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నారు. ఏంబీసీలు, మిగతా వారి నుంచి నాయకత్వ హోదా లభించింది. మేం బీసీ డిక్లరేషన్‌ పెట్టినప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత. సమాజ శ్రేయస్సు కోరుకునే లీడర్‌ వైయస్‌ జగన్‌ మనకు ఉన్నారు. ఆయన తలపెట్టిన యజ్ఞంలో మనమందరం భాగస్వాములమవుదాం. దాని ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందించే దిశగా పనిచేద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.  

 

తాజా వీడియోలు

Back to Top