రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు.జిల్లా,నియోజకవర్గం,మండల వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయాల్లో పార్టీనేతలు,శ్రేణులు మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో అనాధశ్రమంలో అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.రాజ్యాంగ ఫలాలు దేశంలో పౌరులందరికి అందాలని రమేష్‌రెడ్డి కోరారు.శ్రీకాకుళం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు.జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం జాతీయ జెండా ఆవిష్కరించారు.రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్తుత పాలకులు తూట్లు పొడుస్తున్నారని తమ్మినేని అన్నారు.రాజ్యాంగ మౌలిక సూత్రాలు పాటించని వ్యక్తులను పరిపాలించే హక్కు లేదన్నారు.రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును టీడీపీ ప్రభుత్వం అక్రమంగా తొలగిస్తుందని విమర్శించారు.ఏపీలో రాజ్యాంగం అమలు కావడంలేదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఓట్లను తొలగిస్తున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పి గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.గుంటూరు జిల్లా  చిలుకలూరిపేట వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేత విడదల రజనీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పార్టీనేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అడుగడుగున హక్కుల  హననం జరుగుతుందని, ప్రజాస్వామాన్యినికి తూట్లు పొడుస్తున్నారని ఆమె విమర్శించారు.విశాఖ జిల్లా భీమిలి వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు 170 అడుగుల  జాతీయ జెండాను ప్రదర్శించారు.మువ్వన్నెల జెండాలను ఎగురవేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.యువతలో దేశభక్తిని పెంపొందించడానికి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు భీమిలి వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ అక్కరమాని విజయనిర్మల అన్నారు.

Back to Top