నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి పద్మజ

 
విజయవాడ: మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తప్పవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని ఆమె మండిపడ్డారు. పద్మజ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలను వేధించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని, గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడంపై పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను కోరుతామన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా రక్షణ కోసం ముందడుగు వేశారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అనేక చట్టాలు తీసుకొచ్చారన్నారు.

Back to Top