రాష్ట్రాన్ని దొంగల హబ్‌గా మార్చారు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

 
టీడీపీ రాజకీయాలను ప్రజలు అసహ్యంచుకుంటున్నారు

వైయస్‌ జగన్‌ను ప్రజలకు దూరం చేయాలని కుట్రలు 

ఈడీ, సీబీఐ, ఐటీలు రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు జీవోలు ఇచ్చారు

వైయస్‌ జగన్‌ మీదకు సీబీఐ వస్తే మహాద్భుతం అంటున్నారు

చంద్రబాబుది రెండు నాలుకల సిద్ధాంతం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దొంగల హబ్‌గా మార్చారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. రాజధాని భూములను చంద్రబాబు కారుచౌకగా తన బినామీలకు క్యాష్‌అండ్‌ క్యారీ పద్ధతిలో కట్టబెట్టారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన భూ కేటాయింపులు ఒక్కసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమవుతుందన్నారు. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి వందల ఎకరాల భూములను కొన్ని కంపెనీలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. ప్రజల దృష్టికి వెళ్లకుండా టీడీపీ హడావుడిగా కేటాయింపులు చేస్తుందన్నారు. వైయస్‌ జగన్‌పై 2017లో ఈడీ ఓ లేఖరాసిందని, దాన్ని బయటకు తీసుకొచ్చామని చంద్రబాబు బ్యాండ్‌బాజా తీరు చూస్తే 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన కుట్రలు గుర్తుకు వస్తున్నాయన్నారు. రోజుకు కట్టలకొద్ది కథనాలతో నాడు వైయస్‌జగన్‌పై తప్పుడు ప్రచారాలు చేయించారన్నారు. ఇదే టీడీపీ ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని కుట్లు చేసిందన్నారు. మళ్లీ ఎన్నికలు రావడంతో అదే మూసపద్ధతితో చంద్రబాబు ముందుకు వచ్చారన్నారు.

టీడీపీ తీరును ప్రజలు అసహ్యంచుకుంటున్నారన్నారు. ప్రజల మద్దతు ఉన్న వైయస్‌ జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు దుర్భిద్దితో వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన బినామీలపై ఈడీ, సీబీఐ దాడులు చేసేందుకు వస్తే ఈ సంస్థలు దుర్మార్గమైనవని నిప్పులు చెరిగిన చంద్రబాబు ఈ రాష్ట్రంలోకి ఆ సంస్థలను రానివ్వమని ఓ జీవో కూడా విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రాన్ని ఒక దొంగల హబ్‌గా మార్చారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలు తన జోలికి వస్తే గగ్గోలు పెట్టడం, ఇదేదో ఏపీ ప్రజలపై దాడి అనడం, ప్రజలందరూ కూడా తనను రక్షించాలని చావుకేకలు, గావు కేకలు పెట్టడం అందరం చూశామన్నారు.

అదే సీబీఐ, అదే ఈడీ వైయస్‌ జగన్‌పై 2017లో ఏదో దాచేసిందని, ఇవాళ మహా అద్భుతం జరిగినట్లు ఈడీ, సీబీఐలను కీర్తిస్తున్న చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. రెండు సిద్ధాంతాలు, రెండు కళ్లు అంటూ..రెండు వేళ్లు చూపిస్తారని ఎద్దేవా చేశారు. తనపై సీబీఐ, ఈడీ వస్తే ఒకరకం, వైయస్‌జగన్‌పై ఈ సంస్థలు వస్తే మరోరకంగా చంద్రబాబు, తన మీడియా చేస్తున్న తీరు అన్నారు. రెండు నాల్కల దోరణితో వ్యవహరిస్తున్న వ్యక్తిని ఏం చేయాలన్నది ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచిస్తున్నారని చెప్పారు. గత వారం రోజులుగా క్యాష్‌ అండ్‌ క్యారీ పద్దతిలో రాజధాని ప్రాంతంలోని భూములను కారుచౌకగా కట్టబెట్టి , దానిపై విచారణలు జరగకుండా అడ్డుకుంటూ..వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడటం దుర్మార్గమన్నారు.  

 

Back to Top