డ్వాక్రా మహిళలను చంద్రబాబు అప్పుల్లోకి నెట్టాడు..

చెల్లని చెక్కులతో మోసం చేస్తారా...

చంద్రబాబు కాపీ రాయుడు

వైయస్‌ఆర్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ...

హైదరాబాద్‌: డ్వాక్రా మహిళలకు చెల్లని చెక్కులు ఇచ్చి.. మహిళలకు అండగా ఉంటామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. డ్వాకా రుణాలు మాఫీ చేయకుండా చెక్కులు ఎందుకని ప్రశ్నించారు.ఎన్నికల ముందు పోస్టు డేటెడ్‌ చెక్కులు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. కనీసం అప్పు తీర్చడానికి లేదు. రూపాయి తీసుకోవడానికి ఉపయోగపడదన్నారు. ఇలాంటి చెక్కులను మూడు దఫాలుగా ఇచ్చి పెద్దఎత్తున మహిళలకు అండగా ఉంటున్నామని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే సమయంలో ఫిబ్రవరిలో ఒక చెక్కు ఇచ్చి ఆ తర్వాత ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలు అడ్డుపడుతున్నాయని ఎగ్గొట్టడానికి చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మహిళలకు అన్నగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. అన్న అనేవాడు  చెల్లని చెక్కులు ఇస్తారా. ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక డ్వాక్రా గ్రూపుల రుణాల మొత్తం రూ.14 వేల 204 కోట్ల రూపాయలు  ఇప్పటికి అలాగే ఉందన్నారు. రుణాల మీద వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయి ఆ భారం డ్వాక్రా గ్రూపుల మీద పడిందన్నారు. 

ఫలితంగా  బ్యాంకులు డ్వాక్రాగ్రూపులను ఒక దోషులా,దొంగలా చూస్తూ నోటీసులు ఇస్తూ అవమానపరుస్తున్నాయన్నారు.  రుణామాఫీ చేస్తానని చేయకపోగా మహిళలను  అప్పుల్లోకి నెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి ఏ,బిగ్రేడుల్లో ఉన్న డ్వాక్రా గ్రూపులుగా డి స్థాయికి పడిపోయాయన్నారు. మహిళ గ్రూపులను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. రుణమాఫీ చేయకుండా నేడు పదివేలు ఇస్తున్నట్లు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారన్నారు. ఒక రూపాయి కూడా చేతికందకుండా మహిళలను ఊరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ 10వేల చొప్పున 8,604 కోట్లు ఇస్తునట్లు,వడ్డీ రాయితీ కింద 2,514 కోట్లు ఇచ్చినట్లు..ఇప్పుడు ఇస్తున్న 9వేల 400 కలిపితే మొత్తం 21వేల కోట్లు మహిళలకు ఇస్తున్నాం అని  పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా వైయస్‌ఆర్‌సీపీ మహిళ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వాని  ఒక ప్రశ్న అడిగారని.. 2014–15, 2015,–16,2016–17,2017–18 ఈ మొత్తం ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన డ్వాక్రారుణాలు మాఫీ ఎంత అని,జిల్లాలవారీగా వివరాలు చెప్పాలని అడిగామని తెలిపామన్నారు.

డ్వాక్రా రుణాల్ని మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రారుణాలను మాఫీ చేసామని చెప్పడం పచ్చి అబద్ధం కాదా అని ప్రశ్నించారు. డ్వాక్రారుణాలు మాఫీ చేయడానికి కనీసం ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం చేయడంలేదన్నారు. ఓట్లు కోసం అబద్ధాలు అడుతున్నారన్నారు. 2016 నుంచి రాష్ట్ర ప్రభుత్వం  బ్యాంకులకు సున్నా వడ్డీ బకాయిలు కట్టడం మానేసిందని, సున్నా వడ్డీకి బ్యాంకులు అప్పులు ఇవ్వడంలేదన్నారు. సొంత కుటుంబంలో తోబట్టువులకు అన్యాయం చేసిన అన్న రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా అని అన్నారు. పసుపు–కుంకుమ పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు.మహిళాసురుడుగా అభివర్ణించారు. పుసుపుకుంకుమ ఆస్తి విషయంలో సొంత తొట్టువులకే చంద్రబాబు అన్యాయం చేశారన్నారు..అమ్మణమ్మ ఆస్తి లోకేష్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  వైయస్‌ జగన్‌ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారు. చంద్రబాబు కాపీ రాయుడిలా తయారయ్యారన్నారు. డ్వాక్రా రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తానని వైయస్‌  జగన్‌ చెప్పారన్నారు.

Back to Top