మీ ఇంట్లో వారికి జ‌రిగితే ఇలాగే మాట్లాడుతారా

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

వైయస్‌ షర్మిళ పిర్యాదుపై సీఎం ఎదురుదాడి బాధాకరం?

షర్మిళ ఫిర్యాదుపై సుమోటాగా ఎందుకు కేసు నమోదు చేయలేదు

చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ నేరాంధ్రప్రదేశ్‌గా మారింది

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మహిళా అధికారిణిపై దాడి చేస్తే కేసులు ఉండవు
 

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైయస్‌ షర్మిళపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చంద్రబాబు స్పందన సరిగా లేదని, పైగా బెదిరింపులకు దిగడం ఏంటని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు వైయస్‌ షర్మిళ పిర్యాదుపై ఎదురుదాడికి దిగడం బాధాకరమన్నారు. మీ ఇంట్లో వారికి ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎదురైతే ఇలాగే మాట్లాడుతారా అని నిల‌దీశారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. షర్మిళ ఫిర్యాదుపై చంద్రబాబు వ్యాఖ్యలను వాసిరెడ్డి పద్మ ఖండించారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

వైయస్‌ షర్మిళపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఇటీవల తెలంగాణ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చే శారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని వక్రీకరించి మాట్లాడిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తోందన్నారు. ఒక మహిళగా ముందుకు వచ్చి ఇది నా ఒక్కదాని సమస్య కాదని, అనేక మహిళలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి కేసులను దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని షర్మిళమ్మ పోలీసులను కోరినట్లు చెప్పారు. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా భావించి తాను ముందుకు వచ్చానని చెప్పినట్లు గుర్తు చేశారు. వైయస్‌ షర్మిళమ్మ ధైర్యంగా ముందుకు వస్తే అభినందించాల్సింది పోయి, స్ఫూర్తిదాయకంగా వ్యవహరించి అభాగ్యులకు మార్గం చూపినట్లు ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురు దాడి చేయడం విస్మయం కలిగిస్తోందన్నారు.

తెలంగాణ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు..ఇక్కడేందుకు ఫిర్యాదు చేయలేదు..మీరు రాష్ట్ర పౌరులు కాదా అంటూ సీఎం బెదిరించడం సరికాదన్నారు. వైయస్‌ షర్మిళపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి కారకులు ఎవరన్నది చంద్రబాబుకు లె లుసు అన్నారు. షర్మిళపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం చంద్రబాబుకు తప్ప ఎవరికి లేదన్నారు. 2014 ముందుకు వైయస్‌ షర్మిళ పాదయాత్ర చేస్తున్న సమయంలో..మళ్లీ ఇప్పుడు ఎన్నికలకు ముందు పని గట్టుకుని సోషల్‌ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు బెదిరింపులకు దిగడం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళా ధైర్యంగా వచ్చి రోడ్డుపై నిలబడి పిల్లలపై ప్రమాణం చేసి చెబుతుంటే..సానుభూతి తెలపాల్సింది పోయి..భరోసా కల్పించాల్సింది పోయి ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మీ పార్టీకి సంబంధించిన సోషల్‌ మీడియా గ్రూపులలో షర్మిళమ్మపై దుష్ప్రచారం జరుగుతుంటే సుమోటగా తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. మీ ఇంట్లో వాళ్లపై ఇలాంటే ప్రచారం జరిగితే కళ్లప్పగించి చూస్తారా అని నిలదీశారు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కూతురు, సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెల్లెలిపై ఇంతటి దుష్ప్రచారం జరుగుతుంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మీరు ఉసిగొల్పితేనే కదా వర్ల రామయ్య, బాబు రాజేంద్రప్రసాద్, జేసీ దివాకర్‌రెడ్డి వైయస్‌ షర్మిళ గురించి మాట్లాడిందని ఫైర్‌ అయ్యారు. మొన్నటిదాకా ఏపీ పోలీసులకు ఒక క్రెడిబులిటీ ఉందన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక నేరాంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. రాజకీయాల కోసం పోలీసులను వాడుకుంటూ..వారికి స్వేచ్ఛను ఇవ్వడం లేదన్నారు. గత నాలుగేళ్లుగా పోలీసులు మీ ఆదేశాలతో కూర్చోమంటే కూర్చుకుంటున్నారని విమర్శించారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ విషయంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికి తెలుసు అన్నారు. మహిళా అధికారిణిని జుట్టుపట్టుకుని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే డీజీపీ ఎలా వ్యవహరించారో చూశామన్నారు. మీ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.

ఏ కేసును మీరు సరిగా డీల్‌ చేశారని ప్రశ్నించారు. ఏపీ ప్రజల కోసం వైయస్‌ కుటుంబం ఎన్ని కష్టాలు ఎదుర్కొంటుందో అందరికి తెలుసు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, మహిళల ఆత్మగౌరవాన్ని టీడీపీ నేతలు మరిచిపోయారన్నారు. తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారో తప్పక బయటకు వస్తారన్నారు. బాధ్యత గల ముఖ్యమంత్రి అయి ఉంటే వైయస్‌ షర్మిళ విషయంలో ప్రతి స్పందన వేరేలా ఉండేదన్నారు. తప్పించుకోవాలని చూస్తే కుదరదని, దోషులు ఎవరన్నది తేలితే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారో అని ప్రశ్నించారు. మహిళల హక్కుల విషయంలో  బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఫిర్యాదు ఎక్కడ చేస్తే ఏముందని, న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. వైయస్‌ షర్మిళపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరైనవి కావని వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. 
 

Back to Top