బీసీల అభ్యున్నతికి వైయస్‌ఆర్‌సీపీ ముందడుగు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి

బీసీ స్థితిగతులపై ఓ  అధ్యాయన కమిటీ ఏర్పాటు చేశాం

చంద్రబాబు ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు

ఐదేళ్లలో కనీసం ఇచ్చిన హామీలను అమలు చేయలేదు

మళ్లీ ఎన్నికల ముందు మభ్యపెట్టే ప్రయత్నం

కుల వృత్తుల కోసం వైయస్‌ఆర్‌ ఎంతో చేశారు

బీసీ గర్జన సభను విజయవంతం చేయాలి

ఏలూరు:  బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అందరూ అండగా నిలవాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి కోరారు. బీసీల అభ్యున్న‌తి కోసం వైయ‌స్ఆర్‌సీపీ ముందుడుగు వేసింద‌ని తెలిపారు.ఏలూరులో ఈ నెల 17న నిర్వహిస్తున్న బీసీ గర్జన సభ ఏర్పాట్లను శనివారం పార్థసారధి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌సీపీ బీసీ గర్జన కార్యక్రమం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా తూతూమంత్రంగా..బలప్రయోగం లాగా కాదని చెప్పారు. బీసీ గర్జన జరిపేందుకు ఏడాది మూడు నెలల క్రితం వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులతో అధ్యాయన కమిటీ ఏర్పాటు చేశారని చెప్పారు.ఇలాంటి ప్రయత్నం ఏ పార్టీ కూడా చేయలేదన్నారు.

వైయస్‌ జగన్‌ ఒక్కరే అధ్యాయన కమిటీ ఏర్పాటు చేసి బీసీల కష్టాలను తెలుసుకున్నారన్నారు. సమగ్రమైన అధ్యాయనం చేశారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రత్యేకంగా ఐదు గంటల సమావేశం నిర్వహించారన్నారు. అధ్యాయన కమిటీపై కులంకుశంగా చర్చించారన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా చేసే కార్యక్రమాలు మేం చేయడం లేదన్నారు. బీసీల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాన్ని వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేశారన్నారు. టీడీపీ ఇన్నేళ్లు బీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు. పదిహేనేళ్ల చంద్రబాబు పాలనలో  బీసీల సంక్షేమం గురించి ఆలోచించలేదన్నారు.  ఆదరణ పేరుతో అరకొర పరికరాలు అప్పజెప్పి బీసీలను ఉద్దరించామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కుల వృత్తుల పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారన్నారు.

వైయస్‌ జగన్‌ కూడా బలహీన వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఆలోచన చేస్తున్నారని చెప్పారు. మొన్న టీడీపీ జయహో బీసీ కార్యక్రమం నిర్వహించిందని, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదన్నారు.  ఇవాళ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తాయిళాలు ప్రకటిస్తున్నారన్నారు. మత్య్సకారులు, నాయీబ్రహ్మణులను చంద్రబాబు దుర్భషలాడారని మండిపడ్డారు. కేంద్రం ఓబీసీలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, కార్పొరేషన్ల ఏర్పాటుపై 9 జీవోలు ఇచ్చారని, కానీ కార్పొరేషన్‌లో ఎంత మూలధనం కేటాయిస్తారో చెప్పలేదన్నారు. నేతిబీరకాయలో ఎంత నెయ్యి ఉందో చంద్రబాబు ప్రకటించిన కార్పొరేషన్లలో కూడా అంతే నిజం ఉందన్నారు. బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, సామాజికంగా వారి గౌరవం పెంచేందుకు వైయస్‌ఆర్‌సీపీ పని చేస్తుందన్నారు. రేపు జరుగబోయే బీసీ గర్జనకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్న వైయస్‌ జగన్‌కు బడుగు, బలహీనవర్గాలు అండగా ఉండాలని పార్థసారధి విజ్ఞాప్తి చేశారు.

తాజా ఫోటోలు

Back to Top