తిరుపతి: వైయస్ జగన్‌లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్వం వదులుకున్న వ్యక్తి అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ అధిస్టానాన్ని సైతం వైయస్ జగన్ ధిక్కరించారు. కుట్రతో తప్పుడు కేసులు పెట్టినా ఆయన వీరుడిలా పోరాడారన్నారు. వైయస్ జగన్‌పై షర్మిల అన్యాయంగా మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ అనే వ్యక్తి ఒక యుద్ధ వీరుడు. అందుకే పార్టీ ఓడిపోయినా కోట్లాది మంది జగన్ వెంటే ఉన్నారు. వైయస్ఆర్ ఆశయాలను నెరవేర్చే వ్యక్తి వైయస్ జగన్ మాత్రమే. అందుకే ఆయనను ప్రజలు నమ్మారు. తెలంగాణ మెట్టినిల్లు అంటూ షర్మిల అక్కడ రాజకీయాలు చేశారు. మళ్లీ చాపచుట్టేసి తిరిగి ఏపీకి వచ్చారు.. చంద్రబాబుకు నేరుగా మద్దతు పలుకుతున్నారు. షర్మిలను తెలంగాణ, ఏపీ ప్రజలు నమ్మలేదు. చంద్రబాబుతో కలసి సొంత అన్నపైనే షర్మిల కుట్ర చేస్తున్నారు. మీ లాంటి చెల్లి వైఎస్ జగన్‌కు ఉండటం బాధగా ఉంది. వైయస్ జగన్ చిన్న తప్పు కూడా చేయలేదని భూమన చెప్పారు. షర్మిల రాసిన లేఖలు టీడీపీ వెబ్‌సైట్‌లలో ఎలా వస్తున్నాయి?. చంద్రబాబుతో కలిసి అన్నపై కుట్ర చేయడం మీకు తగునా?. కేవలం రెండున్నర ఎకరాల చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు.. అందులో తమ్ముడి, సోదరీమణులకు ఎంత ఆస్తి పంచి ఇచ్చారు అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.