తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీకి ఎన్నికల టార్గెట్ క్లియర్‌గా ఉందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పరీక్షలు రాసే పిల్లల్లా..ప్రతి కార్యకర్త పని చేయాలి. రాబోయే ఈ 50 రోజులు ఇదే పని అని గుర్తు చేశారు. సునామీలాగా వస్తున్న ఆదరణను.. పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి రెండు బటన్ లను(ఒకటి అసెంబ్లీ, రెండోది లోక్‌సభ కోసం) నొక్కించాలి అని సజ్జల అన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న వైయస్ జగనా?.. రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబా? అనేది ఏపీ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. వైయస్ఆర్‌సీపీ మైనారీటి సెల్ రాష్ర్ట కార్యవర్గ సమావేశం పార్టీకేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగింది.సమావేశానికి మైనారీటి సెల్ రాష్ర్ట అధ్యక్షుడు ఖాదర్ భాషా అద్యక్షత వహించారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. వైయస్ఆర్‌సీపీ పాలనలో రాష్ర్టంలో కోటి 47 లక్షల కుటుంబాలు 57 నెలలుగా ఏదో ఒక రకంగా లబ్దిపొందాయి.నగదు,ఇతర ప్రయోజనాల రూపంలో ఇది జరిగింది.ఇందులో అత్యధికంగా ఉంది ఎస్సిఎస్టి,బిసి మైనారిటీ కుటుంబాలు.ఈ వర్గాలనుంచే మన పార్టీ పుట్టుకు వచ్చింది.అందుకే వారు పార్టీ డిఎన్ ఏలో పార్ట్.... ఎస్సీ,ఎస్టిబిసి మైనారీటీలు అందుకు తగినట్లుగానే మన విధానాలు ఉన్నాయి.ఈ వర్గాలు ఉన్నతస్దాయికి రావాలనే లక్ష్యం దిశగా శ్రీ వైయస్ జగన్ పనిచేస్తున్నారు.ఇదే ప్రభుత్వం మరో ఐదు సంవత్సరాలు ఉంటే ప్రభుత్వం పాలనలో బంగారు భవిష్యత్తు ఇవ్వగలం అని 175 కి 175 గెలవాలని జగన్ కోరుకుంటున్నారు.అంతే విశ్వాసంతో పార్టీ నేతలు కార్యకర్తలు ముందుకు వెళ్లగలుగుతున్నారు.ప్రజలు కూడా వైయస్ఆర్‌సీపీకి తమను ఓట్లు అడగడానికి పూర్తి అర్హత ఉందని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు.కార్యకర్తలందరూ ఎంత ఉత్సాహాంగా ఉన్నారు..... ఎన్నికలకు సిధ్దం అవుతున్నారనేది నిన్న రాప్తాడులో సిధ్దం సభ చూసినా అర్దమవుతుందన్నారు. సునామీలా వస్తున్న ఈ ఆదరణను ఛానలైజ్ చేసి పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లి ఫ్యాన్ పై రెండు బటన్లు నొక్కేలా చేయాలి.ఇదే మన అందరి టార్గెట్ అన్నారు.టార్గెట్ క్లియర్ గా ఉంది.మార్గం కూడా వేసి ఉంది.పరీక్షలు దగ్గర పడ్డప్పడు ఎలా ప్రిపేర్ అవుతామో ఆ విధంగా అందరూ ప్రిపేర్ కావాలి. ముఖ్యమంత్రిగారు అన్నట్లు తాను 125 బటన్లు నొక్కాను.మీరు రెండు బటన్లు నొక్కితే చాలని అంటున్నారు.అదే ప్రతి ఒక్కరూ చేయాలని కోరారు.ఒకటి అసెంబ్లీకి మరొకటి పార్లమెంట్ కు అని అన్నారు.రానున్న రోజులలో ఇది చేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలు జగన్ గారి పధకాలను ప్రజలలోకి తీసుకువెళ్లారు.కులం,ప్రాంతం,పార్టీలు బేధాలు లేకుండా అందరికి లబ్ది చేకూర్చాం.వివక్షకు తావు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం ఇలా చేసి ఉండదు.ఇంతలా సాహసం కూడా చేసి ఉండదని చెబుతున్నాను.చేతిలో ఉన్న అధికారం క్యాడర్ వదలేశారు.2014-19 మధ్య జన్మభూీమి కమిటీల మాదిరిగా అరాచకాలు చేయలేదు.వారిలా మాఫియాలా ప్రవర్తించలేదు.వైయస్సార్ సిపి అధికారంలోకి రాగానే చాలామంది అదే విధంగా కాకపోయినా అధికారం అనుభవించవచ్చని భావించారు.కాని జగన్ గారు ప్రజలు ఏధి కోరుకున్నారో ఆ విధంగా అవినీతికి,వివక్షతకు తావులేకుండా చేశారు.ఏ రాజకీయపార్టీ అయినా అవినీతికి వివక్షతకు తావులేకుండా పారదర్శకంగా పరిపాలన అందించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్లారు.అలా చేసినప్పుడే ప్రజల ఆధరణ ఉంటుంది.శాశ్వతంగా ప్రజల మనస్సులో చెరగని ముద్రవేస్తామని భావిస్తారన్నారు.అలా చేసినప్పుడే ప్రతి కార్యకర్త సగర్వంగా ప్రజల వద్దకు ముందుకు వెళ్ళ గలగుతారని అన్నారు.అదికారం అంటే భాద్యతగా ఫీలవ్వాలనేది జగన్ నమ్మారు.అదే రాజకీయపార్టీగా ప్రజలలో శాశ్వత గుర్తింపు తెస్తుందని తెలియచేశారు. వైయస్ఆర్‌సీపీ నామినేటెడ్ పదవులలో కూడా మైనారీటిలకు జగన్ గారు పెద్దపీట వేశారు.డిప్యూటి సిఎం,మండలి డిప్యూటి ఛైర్సపర్సన్ దగ్గర్నుంచి శాసనమండలిలో సభ్యులుగాను,వార్డు మెంబర్లు,మండల,పట్టణ,నగరస్దాయిలలో కేవలం మైనారీటీల ప్రతినిధులగానే కాక కొన్ని వర్గాల ప్రతినిధులుగా గతంలో క్రియేట్ చేసేవారు కాని జగన్ మైనారీటీలు అన్ని వర్గాల ప్రతినిధులుగా నాయకత్వాన్ని తీర్చిదిద్దుతున్నారు అని తెలియచేశారు.గతంలో కోటాకింద్ ఇచ్చేవారు.నేడు ఎస్సిఎస్టి,బిసి,మైనారిటీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు.పార్టీ,ప్రభుత్వ వేదికలపై మహిళలు,మైనారీటీలు అత్యధికంగా కనిపిస్తున్నారు.మాటల్లో కాదుచేతల్లో చూపిద్దాం అని జగన్ గారు భావిస్తున్నారు.ఇది సంప్రదాయం కాదని చాలామంది అన్నారు.ఏ పార్టీలు కూడా గతంలో ధైర్యం,సాహసం చేయలేదు.కాని జగన్ మైనారీటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చరిత్ర సృష్టించారన్నారు.నామినేటెడ్ పదవులలో ఎస్సిఎస్టి,బిసి,మైనారీటి,మహిళలకు 50 శాతం తప్పనిసరిగా జగన్ గారు అమలు చేస్తున్నారు. కొన్ని కులాల్లో పదవులు ఉన్నా కూడా వారిలో నాయకులను వెదకాల్సిన పరిస్దితి వచ్చింది. అదే విధంగా మహిళల్లో కూడా ఉంది. అందుకే కొన్ని కుటుంబాలలో ఆయా నాయకుల భార్యలను ఆయా పదవులలో నియమించడం జరిగిందన్నారు.ప్రాసెస్ ప్రారంభమైంది.ఇక్కడ నుంచి తయారైన మైనారీటినేతలు ఎదిగే అవకాశం జగన్ గారు అనుసరిస్తున్న విధానం వల్ల కలుగుతుంది అన్నారు. నెక్స్్ట ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఇక్కడనుంచి తయారైన మైనారీటీలు వందల వేలమంది నాయకత్వం వహించే అవకాశం కలుగుతుందన్నారు. అదే విధంగా నామినేటెడ్ పదవులలో పదవులు దక్కించుకున్నారు.రానున్న కాలంలో రాష్ర్ట శాసనసభకు,రాజ్యసభకు, లోక్ సభకు పోటీ పడే పరిస్దితి వస్తుంది అన్నారు.అలాంటి పరిస్దితిని క్రియేట్ చేయడం జగన్ గారి గొప్పతనం అన్నారు. జగన్ చేస్తున్న ఈ ప్రయోగం మైనారీటీలకు,అట్టడగు వర్గాలకు ఎంతగా ఉపయోగపడుతుందనేది పార్టీ నేతలంతా ప్రజలలోకి ఆయా వర్గాల కుటుంబాలకు వివరించాలని కోరారు. మండల,పట్టణ స్దాయిలో వైస్ ఛైర్మన్ రెండో పదవిని క్రియేట్ చేశామన్నారు.అది ఒక రూల్ తేవడం జరిగిందన్నారు.దానివల్ల సామాజిక న్యాయంఅనేది జగన్ గారు ఆచరణలో చేసి చూపించారు.గతంలో చాలామంది పెదవి విరిచారు.కాని నేడు అదే వైయస్సార్ సిపి బలం అయింది.గడపగడపకు జరిగేవరకు చాలామందికి అనుమానాలు ఉన్నాయి.కాని ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం దానివల్ల పార్టీకి ఎంతగా చేరవైందో అందరికి తెలిసింది అన్నారు.టిడిపి ఎంతమందితో కలసి వచ్చినా వైయస్ఆర్‌సీపీ ఘన విజయం ఖాయమన్నారు. చంద్రబాబు జనసేనతోనే కాక బిజేపిని కలపుకునేందుకు కిందమీద పడుతున్నారు. నిజానికి నక్సలైట్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో లేరు ఉంటే వారిని సైతం చంద్రబాబు పొత్తుకోసం లాగేవారని ఎధ్దేవా చేశారు. వైయస్ఆర్‌సీపీనా...టిడిపినా...చంద్రాాబాబా...జగన్ గారా ఎవరు కావాలనేది చూజ్ చేసుకోవాలి. జగన్ గారుచేసిన మేలు...చంద్రబాబు చేసిన మోసాలు వీటిని ప్రజలకు వివరించాలన్నారు.షాదీ తోఫా వంటి పధకాలు అవసరం లేకుండానే మైనారీటీ కుటుంబాలు ఆర్దికంగా నిలబడేలా జగన్ గారు ఆలోచనలు సాగుతుంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలకు వస్తున్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం...లేదా మూడు సిలెండర్లు ఇస్తే ఓట్లు వస్తాయి....అని జగన్ గారు అలా ఆలోచించడం లేదు.తన ఆలోచన అంతా...ఎన్నికలు వస్తున్నాయని తాయిలాలు ఇస్తే వాటిపై ఆధారపడి ఉండే బతుకులుగా ప్రజల బతుకులు కాకుండా ఎవరి అంతట వారు ఆలోచించుకుని వారి కాళ్లపై వారు నిలబడి వారి కుటుంబాలను పైకి తెచ్చుకోవడం ప్రతి పేద కుటుంబం కూడా అలా ఉండాలనే ధ్యేయంతోముందుకు వెళ్తున్నారని తెలియచేశారు.ఇలా అన్ని వర్గాలు బావించినప్పుడు సామాజిక న్యాయం జరుగుతుందని జగన్ గారు భావిస్తుంటారని తెలియచేశారు. భారతదేశంలో2029 వచ్చేసరికి సామాజికన్యాయంలో గాని అభివృధ్ది-సంక్షేమం లో గాని కలగలిపిఅభివృధ్ది చెందే స్టేట్ ఏదైనా ఉందంటే అది ఏపినే కనిపిస్తుంది అన్నారు.. ప్రపంచంలో స్టడీ చేయదగ్గ రాష్ర్టంగా ఏపి ఉంటుందన్నారు.మనలా సమాజంలో కులాలు,విభేదాలు ఉన్న ప్రాంతాలు ఎక్కడా ఉండవు.జగన్ గారు సంస్కరణలను ప్రారంభించినప్పుడు ఏమవుతుందా అని మేం కూడా అనుకునేవాళ్లం .ఇప్పుడు పూర్తి పిక్చర్ వచ్చిందన్నారు.కోవిడ్ లాంటి సంక్షోభాన్ని తట్టుకున్నామని అన్నారు.ప్రజల కొనుగోలుశక్తి పెరిగిందన్నారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 22 కోట్ల రూపాయలు వివిధ పనులనిమిత్తం వెళ్లాయన్నారు.స్దానికంగా ఉన్న నాయకత్వంలో మార్పు వస్తే ఎకానమీలో అభివృధ్ది కనిపిస్తుందన్నారు.దేశం అంతా చూస్తే ఆంద్రప్రదేశ్ లోనే అభివృద్ది కనిపిస్తుందన్నారు.చంద్రబాబు అవినీతికేసులో అరెస్ట్ అయ్యాడు.50 రోజులు జైలులో ఉన్నారు.అయినా నేడు రొమ్ము విరుచుకుని తిరుగుతున్నారు.అధికారం ఉండగా పోలవరం ఇస్తే చంద్రబాబు ఏటిఎం చేసుకున్నారని మోది కూడా చెప్పారు.తిరిగి ఆయన వస్తే ఎంత రాష్ర్టంలో పరిస్దితి ఎంత భయంకరంగా ఉంటుందనే అంశాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో శాసనమండలి లో ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, మైనారీటి సెల్ నేతలు ఫరూకీ,హంజా ఉస్సేనీ,శాసనమండలి సభ్యులు ఇషాక్ భాషా, పార్టీ మైనారీటి సెల్ రీజనల్ కోఆర్డినేటర్ లు భర్కత్ అలీ,షఫీ అహ్మద్ ఖాధ్రీ,బషీరుద్దీన్,జానీభాషా, ఇమాం హుస్సేన్ పాల్గొన్నారు.