తాడేపల్లి : నారా రామమూర్తి నాయుడు ఎందుకు పిచ్చి వాడయ్యాడో చంద్రబాబు సమీక్షించాలని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు సూచించారు. ఇవాళ ఏపీ కేబినెట్‌లో చర్చించిన అంశాలపై టీజేఆర్ సుధాకర్ బాబు స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసును సమీక్షించే అధికారం చంద్రబాబుకు ఎక్కడిది? వివేకానందరెడ్డి హత్య కేసును జగన్ మీద ఆయన బంధువుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు వివేకా హత్య జరిగిందే గత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సమయంలో డీజీపి ఏం రాశారో నిగ్గు తేల్చాలి నారా రామమూర్తి నాయుడు ఎందుకు పిచ్చి వాడయ్యాడో చంద్రబాబు సమీక్షించాలి రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై సమీక్ష చేయాలి జనసేన నేతలు మహిళలపై చేసిన అఘాయిత్యాలపై సమీక్షించాలి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తల హత్యలపై సమీక్ష చేయాలి అవేమీ చేయకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామంటే కుదరదు రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు చేయాల్సిన మేలు గురించి క్యాబినెట్‌లో చర్చిస్తే మంచిది కేబినెట్‌లో చౌకబారు అంశాల మీద కూడా సమీక్ష చేయటం ఇప్పుడే చూస్తున్నాం బడ్జెట్‌లో సూపర్ సిక్స్ హామీలకు నిధులను కేటాయించలేదు దీనిపై ప్రజల దృష్టిని మరల్చటానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు సుప్రీంకోర్టు విచారణలో ఉన్న కేసుపై విచారణ చేయటానికి చంద్రబాబు ఎవరు?