రాజమండ్రిలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

తూర్పుగోదావరి:  రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి.వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ వేడుకల్లో వైయస్‌ఆర్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన హరిదాసు,గంగిరెద్దు మేళాలు, గొబ్బెమ్మ పూజలు వంటి కార్యక్రమాలతో కోలాహాలం నెలకొంది.మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు మార్గాని భరత్,షర్మిలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top