రేపు తిరుప‌తిలో సమర శంఖారావం  

వైయ‌స్‌ జగన్‌ నేతృత్వంలో స‌ద‌స్సు

తిరుపతిలోని యోగానాంద్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో ఏర్పాట్లు

తిరుపతి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం ఉదయం తిరుపతిలో సమర శంఖారావం సదస్సు జరగనుంది. తిరుపతిలోని యోగానంద్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో జరగనున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలోని పీఎల్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరగనున్న తటస్థుల సదస్సులో ఆయన పాల్గొంటారు. మధ్యాహం ఒంటి గంటకు సమర శంఖారావం సదస్సుకు వైయ‌స్‌ జగన్‌ హాజరవుతారు.

 

Back to Top