గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయటం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జోగి రమేష్ బుధవారం మంగళగిరి వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ లోకేష్‌ను మడత పెట్టేస్తుందని అన్నారు. వైయస్ఆర్‌సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అన్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు. సీఎం వైయస్ జగన్‌కు అండగా ఉండాలి.. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకురావాలని ఎంతోమంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలనకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకొచ్చారు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని.. ఆయనకు అందరూ అండగా ఉండాలని అన్నారు. బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేదలకు దేవుడని వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సామాజిక న్యాయం అమలవుతుందని తెలిపారు. మంగళగిరిలో బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి మంగళగిరి సీటును బీసీలు కేటాయించారని అన్నారు. వైయస్ఆర్‌సీపీ మరోసారి గెలిపించుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. దొంగల ముఠా.. పచ్చ మీడియా చెప్పే విషయాలను రాసే కథనాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు.