సామాజిక సాధికారతకు సజీవ సాక్ష్యం మేమే

 కనిగిరి బహిరంగ సభలో మంత్రి ఆదిమూల‌పు సురేష్, పార్టీ నేతలు

ప్రకాశం: సామాజిక న్యాయం  అంటే గతం లో ఎన్నికల హామీలు మాత్రమే.. కానీ, ఇప్పుడది ఆచరణలో కనిపిస్తోంద‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. సామాజిక సాధికారతకు సజీవ సాక్ష్యం మేమే అంటూ ఉద్ఘాటించారు. మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు పెట్టి..  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మ‌హిళా సాధికార‌త సాధించార‌న్నారు.  అవినీతి రహితంగా, పేదల ప్రభుత్వంగా సమర్థవంతమైన పాలనను వైయ‌స్ఆర్‌సీపీ అందిస్తోంద‌న్నారు. కాబట్టి టీడీపీ మాయ మాటలు వినొద్దు.. యెల్లో మీడియా వార్తలు అసలు పట్టించుకోవద్దు అన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని, అందుకు తామే ప్రత్యక్ష సాక్ష్యాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ముక్తకంఠంతో చెప్పారు. బుధవారం కనిగిరిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర.. సాయంత్రానికి  పామూరు బస్టాండ్ వద్దకు చేరుకుంది.  అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు, పార్టీ నేతలు మాట్లాడారు. సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు వైయ‌స్‌ జగన్‌. ఆయన పాలనలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సామాజిక వర్గాలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలనలో దక్కిన ప్రాధాన్యత, పదవులు,జరిగిన మంచి గురించి వివరించారు వాళ్లు.  

రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం పాటించే ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్  జగన్‌మోహన్‌ రెడ్డి. దేశానికి ఆయనొక రోల్‌ మోడల్‌. వెనుకబడిన వర్గానికి చెందిన 7 మందికి నాతో సహా రాజ్యసభకి ఆయన పంపారు. కేబినెట్,ఎమ్మెల్సీ ల కేటాయింపు లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు సింహ భాగం ఇచ్చారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అనేది బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక వరం. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మకండి. బీసీలకు రక్షణ చట్టం తెస్తా అని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారు. జగన్నన్న పాలనలో మనం బాగున్నాం.

 
 కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు ఆధ్వర్యంలో నిర్వ‌హించిన వైయ‌స్ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర లో పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మస్తాన్‌ రావు, ఆంజాద్‌ బాషా, మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Back to Top