చంద్రబాబుకు మీడియా ఉంది..సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజలు ఉన్నారు

వైయస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి  

విశాఖ:  ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మీడియా ఉంది..సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజలు ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
సీఎం వైయస్‌ జగన్‌ నిజాయితీ పాలన ప్రజల మనసు దోచుకుందని తెలిపారు.  ఎల్లుండి విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ పదాధికారుల సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సీఎం వైయస్‌ జగన్‌ పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితుల్లో జనం లేరన్నారు. చంద్రబాబు అక్రమాలు చేసినా చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.

బీజేపీని కాదని పవన్‌ బయటకు రమ్మనండి అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చాలెంజ్‌ చేశారు. చీకట్లో చిదంబరంను కలిసింది..కాళ్లు పట్టుకున్నది చంద్రబాబే అని విమర్శించారు.

ప్రతిపక్షాలకు సిద్ధాంతాలు, మేనిఫెస్టో, పార్టీ విధానాలు లేవని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం అనేది ఒక భ్రమ అని వ్యాఖ్యానించారు.

 

Back to Top