అడారి తులసీరామ్ జీవితం.. స్ఫూర్తిదాయ‌కం

అన‌కాప‌ల్లి:  విశాఖ డెయిరీ చైర్మ‌న్ అడారి తుల‌సీరామ్ జీవితం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి లో అడారి తులసీరామ్ సంతాప సభ బుధ‌వారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అడారి చిత్ర‌ప‌టానికి వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..  ఆడారి తులసీరావు రైతుల్లో రైతుగా.. వారికి పెద్దన్నగా నిలిచారు. పొట్ట చేతపట్టుకు వలసపోయే దుస్థితి లేకుండా తమ గ్రామాల్లోనే గౌరవప్రదంగా బతికేట్టు చేశారు. వాళ్లకు ఏ అవసరం వచ్చినా డెయిరీ ఉందంటూ ధీమానిచ్చారు. ఇందుకోసం అహర్నిశలూ శ్రమించారు. పాడిరైతుల పెన్నిధి ఆయన. వారి కుటుంబాలకు కార్పొరేట్‌ వైద్యం.. వారి పిల్లలకు చక్కని చదువులు.. గ్రామాల్లో వంతెనలు,  కల్యాణమండపాల నిర్మాణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడారి తులసీరావు చేసిన పనులు, సాధించిన ఘనతలు కోకొల్లలు. పదో తరగతి కూడా పాసవని ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని పనులు చేశారంటే ఆశ్చర్యంగా ఉంద‌ని చెప్పారు.  కార్య‌క్ర‌మంలో మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌,. మాజీ మంత్రులు క‌న్న‌బాబు, అవంతి శ్రీ‌నివాసులు, పార్టీ ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు పాల్గొన్నారు.

Back to Top