మూడు రాజ‌ధానులు వ‌చ్చి తీరుతాయి

అన్ని ప్రాంతాల అభివృద్దికి మూడు రాజధానులు

ఉత్తరాంధ్ర గర్జనతో ప్రజలు సత్తా చూపించారు

 అమరావతి పేరుతో చంద్రబాబు దోపిడీ చేశారు

విశాఖ‌:  రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానులు నిర్మిస్తార‌ని, విశాఖ నుంచి ప‌రిపాల‌న కొన‌సాగిస్తార‌ని  వైయ‌స్ఆర్‌సీపీ రీజన‌ల్‌ కో-ఆర్డీనేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. విశాఖ పాలనా రాజధానిగా ఉండాలని వైయ‌స్‌ జగన్ భావించారు. అన్ని ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలన్న‌దే ఆయ‌న ల‌క్ష్య‌మ‌న్నారు. చంద్ర‌బాబు అమరావతి లో కోట్ల రూపాయలు దోచుకోవాలని భావించార‌న్నారు.  పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారిని తరిమి తరిమి కొట్టాలి. వారిని నిలదీయాలి. మా ప్రాంతంలో పాలనా రాజధాని వస్తే ఎందుకు అడ్డుకుంటున్నార‌ని నిల‌దీయండ‌ని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. విశాఖ గ‌ర్జ‌న ముగింపు కార్య‌క్ర‌మంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. 
విశాఖను పరిపాలన రాజధాని చేయాలని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని నిర్మించాలని మన సీఎం వైయస్‌ జగన్‌..రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని తలపెట్టారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిని చేయాలని, వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం, కోట్లు దోచుకోవాలని ఆ ప్రాంతంలో భూములు కొన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైయస్‌ జగన్‌ ఎంతో ముందు చూపుతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని న్యాయపరమైన ఇబ్బందుల వల్ల అది అమలు చేయలేకపోయాం. రాబోయే రోజుల్లో సీఎంవైయస్‌ జగన్‌ తలపెట్టిన విధంగా మూడు రాజధానుల నిర్మాణం చేపడుతాం. విశాఖ నుంచి సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన కొనసాగిస్తారు.   పాదయాత్ర పేరుతో మన ప్రాంతానికి దండయాత్రగా వస్తున్న వారిని, ఆ యాత్రకు మద్దతు ఇస్తున్న పార్టీలను, చంద్రబాబు దత్తపుత్రుడు, పచ్చమీడియాను మనమందరం నిలదీయాలి. మీ ప్రాంతంలో శాసన రాజధానిని అభివృద్ధి చేస్తుంటే మేం అడ్డుపడలేదు కదా అని ప్రశ్నించాలి. మా ప్రాంతాన్ని పరిపాలన రాజధాని చేస్తుంటే మీరేందుకు పాదయాత్ర పేరుతో మా ప్రాంతానికి వచ్చి రెచ్చగొడుతున్నారు. మాపై దండయాత్రకు ఎందుకు వస్తున్నారని నిలదీయాలి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మన ప్రాంతానికి పరిపాలన రాజధాని రావాలని ఎంతో గొప్ప సంకల్పంతో గర్జనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జేఏసీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాంత అభివృద్ధికి, పరిపాలన రాజధాని సాధించేందుకు జేఏసీ ఏ కార్యక్రమం తలపెట్టినా మా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, మా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మేమంతా మద్దతుగా నిలుస్తాం. విశాఖకు పరిపాలన సాధించేందుకు మేమంతా పూర్తి మద్దతుగా ఉంటామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top