చంద్ర‌బాబు చేసిన మోసాలు ప్ర‌జ‌ల‌కు ఇంకా గుర్తున్నాయి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర ఎన్నిసార్లు చేస్తారు?

వైయ‌స్ఆర్ సీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు వైవీ సుబ్బారెడ్డి

విశాఖపట్నం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఫాలో అయ్యే దుస్థితి టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌ కూట‌మి నేత‌ల‌కు ఏర్ప‌డింద‌ని వైయ‌స్ఆర్ సీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి ప్ర‌ధాని మోడీ వ‌స్తే త‌ప్ప ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌లేని ప‌రిస్థితి టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు ఏర్ప‌డింద‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంపై ఉత్త‌రాంధ్ర నాయ‌కుల‌తో వైయ‌స్ఆర్ సీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నేత‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మ‌రోసారి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్దేశించారు. స‌మావేశం అనంత‌రం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌లో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధమన్నారు. వైయ‌స్ఆర్ సీపీ సిద్ధం సభలు తర్వాత బహిరంగ సభ పెట్టుకునే ధైర్యం టీడీపీ, జనసేన చేయలేకపోయాయ‌ని ఎద్దేవా చేశారు. పవన్ క‌ళ్యాణ్‌ ఎన్నిసార్లు వారాహి యాత్ర చేస్తార‌ని ప్ర‌శ్నించారు. 2014-19 మధ్య ఎదురైన మోసాలు ఇప్పటికీ రాష్ట్ర ప్ర‌జానీకానికి గుర్తున్నాయన్నారు. కూటమి మరోసారి జనం ముందుకు వస్తోంది కాబట్టి ప్రజలను అప్రమత్తంగా ఉండమని కోరారు. సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి పాలనలో జరిగిన మంచిని, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిసి చేసిన‌ మోసాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్రజలకు వివరిస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Back to Top