గుంటూరు: అనుబంధ విభాగాలు పార్టీకి ప్రాణమని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నారు. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో జగనన్న పాలనలో పరిపాలన న్యాయ సంస్కరణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు శాసన మండలి సభ్యులు, కృష్ణా - ఎన్టీఆర్ - గుంటూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామి రెడ్డి, గ్రంధాలయ శాఖ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు తదితరులు పాల్గొని ముందుగా దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. అనుబంధ విభాగాలు పార్టీకి ప్రాణమని అభివర్ణించారు. తాను జిల్లా అధ్యక్షుడి ఉన్న కాలంలో అనుబంధ విభాగాలతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ.. వైయస్ జగన్ గారు గుంటూరులో ఏ కార్యక్రమం నిర్వహించినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అన్నారు. రాబోయే కాలంలో అందరితో సమావేశాలు నిర్వహించి.. పార్టీని 2024లో విజయతీరాలకు చేర్చాలని దిశానిర్దేశం చేశారు.