పార్లమెంటులో వైయస్‌ఆర్‌సీపీ ధర్నా...

హోదా ఇచ్చేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశం..

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఢిల్లీ:పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయస్‌ఆర్‌సీపీ  ఎంపీలు ధర్నా నిర్వహించారు. ప్రత్యేకహోదా, విభజనచట్టం హామీలు నెరవేర్చాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.ఏపీకి హోదా ఇచ్చేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశమన్నారు.చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాను లాంటివారన్నారు. ఏపీ ప్రజలను తుపాను కంటే ఎక్కువగా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులు చేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ  వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top