మంచినీళ్లు, మద్యం, స్కూలు పిల్లల భోజనం, ఆసుపత్రిలో మందులు.. అంతా కల్తీల మయం

కూటమి పాలనపై వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్.

విశాఖపట్నం వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.

దేశంలో అతిపెద్ద కుంభకోణం కల్తీ మద్యం. 

ఈ స్కామ్ లో ఇంకా టీడీపీ పెద్ద నేతల ప్రమేయముంది

కల్తీ మద్యంపై సిబిఐ విచారణ జరిపించాలి. 

అప్పుడే సూత్రధారులు కూడా బయటపడతారు

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్.

మంచినీళ్లు, మద్యం, పిల్లల భోజనం, ఆసుపత్రిలో మందులు

కూటమి పాలనలో అంతా కల్తీ మయం

ఇది కూటమి ప్రభుత్వం కాదు కల్తీ ప్రభుత్వం

నారా వారి పాలన కాదిది - కల్తీ సారావారి పాలన

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్

నాడు వైయస్.జగన్ హయాంలో విద్యాంధ్రా, వైద్యాంధ్రగా ఏపీ 

నేడు మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన చంద్రబాబు

రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం 

కల్తీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకున్న టిడిపి నేతలు

మద్యం షాపుల్లో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమే 

తేల్చి చెప్పిన వరుదు కళ్యాణి వైయ‌స్ఆర్‌సీపీ

విశాఖపట్నం: రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని.. కల్తీ ప్రభుత్వమని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... పిల్లలకిచ్చే తాగునీరు మొదలు భోజనం, ఆసుపత్రిలో మందులు, మద్యం సహా అంతా కూటమి పాలనలో కల్తీమయమైందని మండిపడ్డారు. నాడు వైయస్.జగన్ హయాంలో విద్యాంధ్రగా ఉన్న ఏపీ... చంద్రబాబు పాలనలో మధ్యాంధ్రగా మారిందని ఆక్షేపించారు. కల్తీ ప్రభుత్వం తీరు ప్రజలకు అర్ధమైందని.. ప్రజా కోర్టులో కూటమి నేతలకు తగిన శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...

● నారా వారి పాలన కాదిది - కల్తీ సారావారి పాలన...

కూటమి ప్రభుత్వానికి మహిళలంటే ఏ కోశాన గౌరవం లేకపోగా... చంద్రబాబునాయుడికి, తెలుగుదేశం పార్టీ నేతలకు మహిళల మాన ప్రాణాలంటే కూడా లెక్కలేదు. తమ ముడుపులు కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీమద్యం కుంభకోణమే ఇందుకు నిదర్శనం. దేశంలోనే అతిపెద్ద కల్తీమద్యం కుంభకోణం కూటమి ప్రభుత్వ హయాంలోనే పట్టుబడింది. ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు కూడా టీడీపీ నేతలేనని సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖ అధికారులే చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులే ఊరూరా కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారు. అలాంటి దుస్థితి రాష్ట్ర ప్రజలకు వచ్చింది.

టీడీపీ నేతలు మహిళలు, ప్రజల ప్రాణాల పట్ల బందిపోట్లు, దోపిడీ దొంగల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నారా వారి పాలన కాస్తా కల్తీ సారావారి పాలనగా మారింది. రాష్ట్రాన్ని చీప్ మినిష్టర్ పరిపాలిస్తున్నట్టు కాక.. చీప్ లిక్కర్ మాఫియా పాలిస్తున్న చందంగా తయారైంది. ఇది మంచి ప్రభుత్వం కాదు.. రాష్ట్రాన్ని కల్తీ మద్యంలో ముంచే ప్రభుత్వమన్న విషయం కూడా తేలిపోయింది. ప్రజలకు అందిస్తున్నది కూడా సుపరిపాలన కాదు కల్తీపాలన అన్నది కూడా ప్రజలకు అర్ధమయింది. ఇది కూటమి ప్రభుత్వ పాలన కాదు, కల్తీ ప్రభుత్వ పాలన, ప్రజలకు అందుతున్నది గుడ్ గవర్నెన్స్ కాదు.. కల్తీ మద్యాన్ని అందిస్తున్న పాలన అన్న విషయం కూడా తేలిపోయింది. 

● రాష్ట్రాన్ని మధ్యాంధ్రగా మార్చిన చంద్రబాబు...

వైయస్.జగన్ హయాంలో రాష్ట్రాన్ని నాణ్యమైన విద్యాంధ్రప్రదేశ్, వైద్యాంద్రప్రదేశ్ గా మార్చాలని తాపత్రయపడితే.. చంద్రబాబు నాయుడు మాత్రం నాసిరకం మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కారణం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరు పెరగ్గా.. కల్తీ మద్యం అమ్మకాల కోసం అయితే  చంద్రబాబు ఏకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే గత వైయ‌స్ఆర్‌సీపీ హాయంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపడితే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం షాపులును పెట్టింది. అనంతరం బెల్టుషాపులు విచ్చల విడిగా ఉన్నా... ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత రూ.5 లక్షలు చెల్లిస్తే పర్మిట్ షాపులకు అనుమతి ఇచ్చారు. బార్లు, మద్యం దుకాణాల్లో అమ్మకాల కోసం టైమింగ్స్ మార్చి.. అర్ధరాత్రి వరకు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇవన్నీ రానున్న రోజుల్లో వీళ్లందరూ కల్తీమద్యం తయారు చేసి.. ప్రజలను దానికి బానిసలను చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు.

పదే పదే సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెబుతుంటే అర్ధం కాని రాష్ట్ర ప్రజలకు కల్తీమద్యం అమ్మకాల ద్వారా కల్తీ సంపద సృష్టిస్తారని ఇప్పుడు అర్ధం అయింది. ఇంత పెద్ద మొత్తంలో కల్తీ మద్యం స్కామ్ రాష్ట్ర చరిత్రలోనే కాకుండా.. దేశంలోనే ఈ తరహా స్కామ్ చూడలేము. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే...ఈ కల్తీ మద్యం స్కామ్ లో కీలకనిందితుడు జయచంద్రారెడ్డి.. 2025 ఎన్నికల్లో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ ఛార్జ్, 2024 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన వ్యక్తి, అతని పీఏ, బావమరిది గిరిధర్ రెడ్డి, మరో టీడీపీ నేత జనార్ధన రావులు కలిసి మొలకల చెరువులో ఏకంగా కుటీర పరిశ్రమ తరహాలో కల్తీ మద్యం తయారుచేసే ఫ్యాక్టరీయే ఏర్పాటు చేశారు. మరోవైపు వీరు తయారు చేసిన కల్తీమద్యం ఎక్కడెక్కడ సరఫరా చేశారో ఆరా తీస్తే.. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ ఛార్జ్ జయచంద్రా రెడ్డికి విజయవాడ సమీపంలో భవానీపురంలో మద్యం షాపు ఉంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున కల్తీ మద్యం లభించింది. అంటే అన్నమయ్య జిల్లా నుంచి విజయవాడ వరకు దారిపొడవునా వీరు కల్తీమద్యం సరఫరా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. అంతే కాకుండా ఏలూరు, నెల్లూరు, విశాఖ జిల్లా పరవాడలో దొరికన కల్తీ మద్యం వెనుక టీడీపీ నాయకులే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. కల్తీ మద్యం తాగి ఏలూరులో, పల్నాడు, సత్యసాయి జిల్లాల్లో 4 గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నిజానికి ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేసిన వాళ్ల మీద చర్యలుతీసుకోవాల్సింది పోయి... కూటమి ప్రభుత్వంలో మాత్రం కల్తీమద్యం తయారు చేస్తున్నవాళ్లను పట్టుకున్న ఓ ఎక్సైజ్ మహిళా సీఐ మీద చర్యలు తీసుకోవడం అత్యంత దారుణం. టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జే కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని నడుపుతుంటే.. అతనితో పాటు ఉన్న ఇతర టీడీపీ నేతలు, ఎక్సైజ్ శాఖలో మరెవ్వరికీ బాథ్యత లేదన్నట్టు ఒక మహిళా సీఐ మీద చర్య తీసుకోవడం ఏమిటి ? ఈ ములకలచెరువులో ఏకంగా 17 వేల లీటర్ల కల్తీ మద్యం పోలీసులకు స్వాధీనం చేసుకున్నారంటే... ఏ స్ధాయిలో కల్తీ మద్యం తయారవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇది దాదాపు రూ.1.75 కోట్ల విలువ చేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున తయారు చేసిన కల్తీమద్యాన్ని అమ్మి ఎంతమంది ప్రాణాలు తీయాలనుకున్నారా తలుచుకుంటేనే భయం కలుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారు చేస్తుంటే ఎక్సైజ్ శాఖ ,ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు ?

● సీబీఐ విచారణకు సిద్దమా  ?

భవానీపురంలో అయితే టీడీపీ నేత జనార్ధనరావు కల్తీ మద్యం ఫ్యాక్టరీని ఏకంగా కుటీర పరిశ్రమలా తయారు చేసి అమ్ముతున్నారంటే ఎంత భరితెగించారో అర్దమవుతుంది. కల్తీ మద్యం వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ కల్తీ మద్యం తయారీ వెనుక ఉన్న పెద్దల ఎవరు? ఎవరి ప్రమేయం ఉంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే సీబీఐ విచారణ చేయించాలని మా పార్టీ ఎంపీ మిధున్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ నేతలే కల్తీ మద్యం తయారీలో ఉన్నారు.. వీరితో పాటు ఇంకా మరింత మంది టీడీపీ నేతల బాగోతాలు బయటపడతాయనే సీబీఐ విచారణకు భయపడుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కేవలం 10 కిలో మీటర్ల దూరంలోనే కల్తీ మద్యం డంప్ దొరకగా... ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీయే ఉందంటే.. టీడీపీ నేతలు ఎంత దారుణంగా, ఎంత ధైర్యంగా కల్తీమద్యం అమ్ముతున్నారో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం కల్తీ మద్యం వ్యవహారంలో కూరుకుపోయిన టీడీపీ నేతలు... తిరిగి వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై బురదజల్లడం హాస్యాస్పదం. మీకు ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో మందు తప్ప, కల్తీ మద్యం తప్ప అన్ని సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, ఆరోగ్యశ్రీ సేవలు నిల్చిపోయాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం నిలిచిపోయింది, నాడు నేడు ద్వారా ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణం ఆగిపోయింది. మహిళలకు సున్నావడ్డీ పథకం, చేయూత, ఆసరా పథకాలూ బంద్ అయ్యీయి. కేవలం మద్యం సరఫరా, అమ్మకాల పెంచడమే అజెండాగా కూటమి ప్రభుత్వం మహిళల మాన, ప్రాణాలతోనూ ప్రజల ఆరోగ్యంతోనూ చెలగాటమాడుతోంది. 

● రాష్ట్రంలో ఏరులై పారుతున్న కల్తీ మద్యం...

మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తల చేతుల్లో పెట్టి రాష్ట్రంలో మద్యాన్ని కూటమి ప్రభుత్వం ఏరులై పారిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాల్లో ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం బాటిల్ ఉంటుంది. ఆ స్ధాయిలో కల్తీ మద్యం అమ్మకాలు పెరిగాయి. తద్వారా రాష్ట్రంలో మహిళల మీద 4 శాతం నేరాలు పెరగ్గా.. అత్యాచారాల సంఖ్య 10 శాతం కూటమి ప్రభుత్వంలోనే పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. విచ్చలవిడి మద్యం ప్రభావంతో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు కల్తీ మద్యం ప్రభావంతో అనారోగ్యానికి గురైన ఆసుపత్రికి పాలవుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. వీటికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మద్యం, డ్రగ్స్, గంజాయి కేసులు 21 శాతం పెరిగాయంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైందో అర్థమవుతుంది.  తమకు రావాల్సిన ముడుపులు కోసం ప్రజల ఆరోగ్యాన్ని, వారి రక్షణను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా గాలికొదిలేశారు. 

● టీడీపీ నేతల కుటీర పరిశ్రమలా కల్తీ మద్యం తయారీ...

నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇవ్వగా... ఇవాళ సాక్షాత్తూ టీడీపీ నేతలే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ దొరికిపోయారు. దీనికి బాధ్యతగా చంద్రబాబు తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యంపై విపరీతంగా దుష్ప్రచారం చేశారు.  ఏపీ మద్యం తాగి ఆరోగ్యం పాడైన బాధితులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు హైదారాబాద్ కు చెందిన  కొంతమంది వైద్యులు చెప్పారన్న పవన్ కళ్యాణ్... ఇవాళ ఏపీలో కల్తీ మద్యాన్ని కూటమి నేతలే కుటీర పరిశ్రమలా తయారు చేసి విక్రయిస్తుంటే మీ కళ్లకు కనిపించడం లేదా? ఇప్పుడు ఏపీలో కల్తీ మద్యం బాధితులకు మీ దగ్గరకు వచ్చారా అని మీరు హైదారాబాద్ లో డాక్టర్లను అడగడం లేదా? ఈ కల్తీ మద్యానికి మీరు బాధ్యత వహించరా? 

గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీడియా సమావేశాల పెట్టి మరీ కల్తీ మద్యం తయారీ గురించి టీడీపీ నేతలు మాట్లాడారు. అంటే ఇప్పుడు అదే అనుభవంతో టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారు చేస్తున్నారా? తాను 99 నాటి చంద్రబాబునని పదే పదే చెబుతున్న చంద్రబాబు మాటలు వెనుక అంతర్యం... ఇప్పుడు రూ. 99 లకే మద్యం పేరుతో కల్తీ మద్యం అమ్మడంతోనే ఆయన అంతరంగం అందరికీ అర్దమయింది.

● కూటమి పాలన కల్తీల మయం.

ఇవాళ రాష్ట్రంలో మద్యం కల్తీ, మంచినీళ్లు కల్తీ, ఆసుపత్రిలో ఇచ్చే మందులు కల్తీ, చివరకు స్కూళ్లలో పిల్లలకు పెట్టే భోజనం కూడా కల్తీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది కూటమి ప్రభుత్వం కాదు కల్తీ ప్రభుత్వం అన్న విషయం ప్రజలందరికీ అర్ధం అయింది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యానికి వ్యతిరేకంగా మహిళలతో కలిసి పోరాటం చేస్తామని వరుదు కళ్యాణి తెలిపారు. కల్తీ మయంగా మారిన కూటమి పాలనకు త్వరలోనే ప్రజా కోర్టులో శిక్ష పడే సమయం ఆసన్నమైందని ఆమె హెచ్చరించారు.

Back to Top