అలాంటి వ్యక్తులకు సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు

ఎన్నికల వాయిదా రాజకీయ కోణంలోనే జరిగింది

ఈసీ తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది

ఎన్నికలు వాయిదా వేస్తూ కోడ్‌ ఎలా అమలు చేస్తారు?

ఈసీ తన పరిధిని దాటి వ్యవహరించింది

కోడ్‌ ఎత్తివేయడం, సంక్షేమ పథకాలు కొనసాగించమని చెప్పడం శుభపరిణామం

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక చంద్రబాబు ఉన్నారు

రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ఈ చారిత్రక తీర్పు వచ్చింది

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో కూడా ముగ్గురు వ్యక్తులు ఉండాలి

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు

తాడేపల్లి: వ్యవస్థలను తన ఇష్టం వచ్చినట్లు నడిపి రాజకీయ కోణంలో ఎన్నికల కమిషన్‌ పని చేస్తే న్యాయస్థానాలు ఒప్పుకోవని సుప్రీం కోర్టు  తీర్పుతో స్పష్టమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ ముసుగులో తెర వెనుక ఉండి నడిపే దుర్మార్గమైన వ్యక్తులకు సుప్రీం కోర్టు తీర్పు ఒక చెంప పెట్టు అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ తక్షణమే ఎత్తివేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శుభపరిణామమన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోవడంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది.ఇది ఒక కుట్ర పూరితమైన వాతావరణంలో కరోనా వ్యాధిపై సాగు చెప్పి నిరంతరంగా వాయిదా వేయడం వల్ల రాష్ట్రం నష్టపోతుందని సీఎం వైయస్‌ జగన్‌ కూడా గవర్నర్‌ను కలిసి వివరించారు. ఆ తరువాత పరిస్థితులను ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ తెలియజేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న ఈ కుట్రపూరితమైన నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టులో మొన్న పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ రోజు ఆ పిటిషన్‌పై వాదప్రతివాదనలు విన్న తరువాత సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై టీడీపీ నేతలు, ఇంకోందరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాస్తవాలు, కోర్టు ప్రకటించిన ఆర్డర్‌ను నిశితంగా పరిశీలిస్తే  చాలా విషయాలు స్పష్టమవుతాయి. ముఖ్యంగా సుప్రీం కోర్టు తీర్పు వల్ల అర్థమైన అంశం ఏంటంటే..రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తన పరిధి దాటింది. రాజ్యంగం ప్రకారం తాను చేయాల్సింది చేయకుండా పరిధి దాటిందని ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పుతో ప్రజలందరికీ అర్థమైంది. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే ఎన్నికలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయ కోణంలో ఉందన్నది బట్టబయలైంది. చాలా నిశితంగా పరిశీలిస్తే ..ఎవరిని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారు.బాధ్యత కలిగి, ఎన్నికకాబడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను సంప్రదించకుండా వాయిదా వేశారు. ఆరువారాల పాటు వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చెప్పలేదు. అంటే నిరవధికంగా వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్‌ మాత్రం తూచా తప్పకుండా కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఎలా కొనసాగిస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం పని చేయకుండా స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు..తక్షణమే ఎన్నికల కోడ్‌ ఎత్తివేస్తున్నామని కోర్టు చెప్పిందంటే దాని అర్థం ఏంటి? పరిధి దాటి ఎన్నికల కమిషన్‌ వ్యవహరించినట్లే కదా?. అందరూ కూడా ఎన్నికల కమిషన్‌ చెప్పుచేతల్లో ఉండాలని భావించారు. సుప్రీం కోర్టు నిర్ణయంతో ఎన్నికల కమిషన్‌ తప్పు చేసిందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికల పట్ల చొరవ తీసుకుంది. సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెళ్లి చరిత్రాత్మకమైన ఆర్డర్‌ తీసుకువచ్చారు. ఇలాంటి తప్పులు చేస్తే ఊరుకోమన్న హెచ్చరిక వచ్చింది. 
ఎన్నికలు వాయిదా వేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది. ఇదే విషయాన్ని గౌరవ న్యాయమూర్తులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఎన్నికలకు వెళ్లాల్సిందేనని కోర్టు చెప్పింది. ఈ విషయం చెప్పిందంటే సిగ్గు పడాలి. వ్యవస్థలను తన ఇష్టం వచ్చినట్లు నడిపి రాజకీయ కోణంలో ఎన్నికల కమిషన్‌ పని చేస్తే న్యాయస్థానాలు ఒప్పుకోవని ఈ తీర్పుతో స్పష్టమైంది.
వాస్తవంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు చివరి దశలో ఉన్నప్పుడు ఆపేశారు. ఇప్పటికే నామినేషన్లు, విత్‌డ్రాలు అయిపోయాయి. పోలింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కేవలం పోలింగ్‌ను ఆపేయడం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవాలి.
కరోనా వ్యాధి ఇవాళ ఏ స్టేజీలో ఉంది. రాష్ట్రంలో నంబర్‌ వన్‌ స్టేజీలో ఉంది. రేపు రెండో స్టేజీలోకి వెళ్లే అవకాశం ఉంది. స్టేజీ వన్‌లోనే ఎన్నికలు నిర్వహించి ఉంటే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మేయర్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, వార్డ మెంబర్లు ఉంటే కరోనాపై యుద్ధం చేసేందుకు వీలు ఉండేది. వీళ్లంతా కూడా కరోనాపై యుద్ధం చేసేవారు. కుట్ర పూరితంగా ఈ ఎన్నికల కమిషన్‌ వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరించబట్టే కమిషన్‌ భండారం బట్టబయలైంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ ఆమోదంలో ఉంటుంది. ఇకపై జరిగే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్‌ తప్పనిసరిగా సంప్రదించాల్సిందే.  ఎన్నికల కమిషన్‌ ముసుగులో వెనుక ఉండి నడిపే దుర్మార్గమైన వ్యక్తులకు సుప్రీం కోర్టు తీర్పు ఒక చెంప పెట్టు.
కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారు. ముగ్గురు సభ్యులు కలిసి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో ఏకసభ్య కమిషన్‌ ఉండటం వల్ల ఇలాంటి అప్రజాస్వామికమైన నిర్ణయాలు, రాజకీయాలు చొప్పించబడిన విషయాలు జరుగుతాయి. రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు సభ్యులు ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.

Back to Top