శ్రీకాకుళం: పలాస పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పలాస నియోజకవర్గ పరిశీలికులు కె వి సూర్యనారాయణ రాజు(పులి రాజు) ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ.. పాదయాత్రలో చూసిన ప్రతి అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ మూడేళ్లలో దాదాపు 95 శాతం హామీలు అమలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలన్నీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక తూచా తప్పకుండా అమలు చేశారు. రైతులు, అణగారిన వర్గాలకు సంబంధించిన స్పష్టమైన హామీలు నెరవేర్చారు, మహిళా సాధికారత, సామాజిక న్యాయాన్ని కచ్చితంగా పాటిస్తూ చేతల్లో చూపించారు. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తున్నామన్నారు. పలాసలోని నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రగతి భవన్ గా నామకరణం చేయడం ఆనందకరమని చెప్పారు. నియోజవర్గంలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని, 2024లో మళ్లీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.