భరత్‌ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ 

 ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంల వైయ‌స్ఆర్‌సీపీ  అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి మృతి

భ‌ర‌త్ కుటుంబానికి బాసటగా నిలిచిన ప్రవాసాంధ్రులు

వైయ‌స్ఆర్‌సీపీ రాయచోటి అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తోన్న భరత్‌కుమార్‌.. హఠాత్తుగా యాక్సిడెంట్‌లో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు. ఎంతో నిబద్ధతతో పని చేసే మలసాని భరత్‌కుమార్‌ రెడ్డి.. చురుగ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకునే వాడని గుర్తు చేసుకుంటున్నారు. 


ప్రదీప్‌ చింతా, పంచ్‌ ప్రభాకర్‌, శివ మేకా

మలసాని భరత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ  ప్రవాసాంధ్రులు.. మలసాని భరత్‌ కుటుంబానికి తమవంతుగా సాయం అందించారు. NRIలు Dr ప్రదీప్ చింతా , పంచ్ ప్రభాకర్, యాత్ర-2 నిర్మాత శివ మేక లక్షా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వైయ‌స్ఆర్‌సీపీ కోసం భరత్ చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమని, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు. ఇటీవలే ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున ఆర్థిక సాయం అందించిన  వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ భార్గవ్ సజ్జల తో కోఆర్డినేట్ చేసి ఆ కుటుంబానికి ప్రదీప్ చింతా, పంచ్‌ ప్రభాకర్, శివమేకా. బాసటగా నిలిచారు.

Back to Top