వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభించిన వైయస్‌ జగన్‌..

వైయస్‌ఆర్‌సీపీ జెండా ఆవిష్కరించిన వైయస్‌ జగన్‌...

అమరావతి:సర్వమత ప్రార్థనలతో  వైయస్‌ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయాన్ని వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. పెద్ద ఎత్తున వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు తరలివచ్చారు.పార్టీ శ్రేణులో  కొత్త ఉత్సాహం నెలకొంది. దీంతో  పండగ వాతావరణ నెలకొంది. పార్టీ జెండాను వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు.దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి నివాళర్పించారు. జెండా ఆవిష్కరణలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, వైయస్‌ షర్మిల, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి, పార్థసారధి, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యకలపాలు ఇక్కడే నుంచే కొనసాగుతాయి.రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ కేంద్రంగా సమర శంఖారావం మోగించబోతుంది.అంతకు ముందు  ఉదయం సతీసమేతంగా వైయస్‌ జగన్‌ గృహ ప్రవేశం చేశారు.

Back to Top