సీఎంను క‌లిసిన నూత‌న ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డి

అసెంబ్లీ: నూత‌న ఎమ్మెల్సీ పొన్న‌పురెడ్డి రామ‌సుబ్బారెడ్డి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అసెంబ్లీలోని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఛాంబ‌ర్‌లో సీఎంను క‌లిసి పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి ఘ‌నంగా స‌త్క‌రించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన రామ‌సుబ్బారెడ్డికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రామ‌సుబ్బారెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు ఉన్నారు. 

Back to Top