నెల్లూరులో మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరేద్దాం

వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు పార్ల‌మెంట్‌ స‌మ‌న్వ‌య‌క‌ర్త విజ‌య‌సాయిరెడ్డి

నెల్లూరు: నెల్లూరు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మళ్లీ  వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరేద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు పార్ల‌మెంట్‌ స‌మ‌న్వ‌య‌క‌ర్త విజ‌య‌సాయిరెడ్డి పిలుపునిచ్చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీకి సేవ చేస్తున్న నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని స్థానిక ప్రజా ప్రతినిధులను, నాయకులను చూస్తే ఎంతో గర్వంగా ఉంద‌న్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ గారు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి ఎండి ఖలీల్‌ను గెలిపించుకుందామని నెల్లూరు నగరానికి చెందిన పార్టీ కార్పొరెటర్లు, నాయకులకు పిలుపునిచ్చాను.

ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన ఎటువంటి నష్టం లేదు. అధైర్యపడవవలసిన అవసరం లేదు. నెల్లూరులో మొదట నుండి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అని వారికి ధైర్యం చెప్తూ...అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చాను. ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలని విజ‌య‌సాయిరెడ్డి కోరారు.

Image

Back to Top