విజయవాడ: ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’ పేరుతో చంద్రబాబు మాల్‌ప్రాక్టీస్ చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ వారు ఉద్ధేశ పూర్వకంగా వైయస్ఆర్‌సీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిపై ఈసీకి ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఆయన ఫిర్యాదు చేశారు. గుర్తింపు లేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. జనసేన గుర్తింపులేని పార్టీ.. గుర్తింపులేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. చట్ట ప్రకారం గుర్తింపు లేని పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులను కలిసిన అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు వేణుంబాక విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు బోగస్ ఫిర్యాదులతో అర్హులైన ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నాడు లక్షల ఓట్లను తొలగించాలంటూ కోనేరు సురేష్ ద్వారా బల్క్ ఫిర్యాదు – కోనేరు సురేష్ ఇచ్చిన అబద్ధపు బల్క్ ఫిరాదుపై చర్యలు తీసుకోవాలి -తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగానే వైఎస్‌ఆర్‌సీపీ ఓట్లను టార్గెట్ చేసింది -మరో వైపు దొంగ ఓట్ల చేర్పునకూ టీడీపీ పాల్పడుతోంది. ఇప్పటికే 4.36 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించాం. – వన్ సిటిజన్.. వన్ ఓటు అనేది వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధాంతం: ఎంపీ శ్రీ వి. విజయసాయిరెడ్డి -గుర్తింపులేని రాజకీయ పార్టీ ‘జనసేన’ -175 స్థానాల్లో పోటీ చేయని పార్టీకి కామన్‌సింబల్ ‘గాజుగ్లాసు’ కేటాయింపు చట్టవిరుద్ధమే.. – తెలుగుదేశం తమ అలెయెన్స్ పార్టీగా జనసేనను చెప్పుకుంటుంది – మరి, ఇన్నాళ్లూ బీజేపీ అలెయెన్స్‌గా జనసేన పార్టీ ఎలా చెప్పుకుంది..? – గుర్తింపులేని పార్టీకి అపాయింట్మెంట్ అనుమతిపై సీఈసీ వద్ద అభ్యంతరం తెలిపాం.: ఎంపీ శ్రీ వి. విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేశ్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి – తండ్రీకొడుకులు గౌరవ సీఎంపై అసభ్యపదజాలం వాడటం తీవ్ర అభ్యంతకరం – ప్రభుత్వ అధికారుల్ని ఎర్రబుక్కుతో లోకేశ్ బెదిరిస్తున్నాడు: సీఈసీ దృష్టికి తీసుకొచ్చిన ఎంపీ శ్రీ వి. విజయసాయిరెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఎంపీ శ్రీ వి. విజయసాయి రెడ్డి, రాజమండ్రి ఎంపీ శ్రీ మార్గాని భరత్ ఈరోజు విజయవాడ నోవాటెల్ హోటల్‌లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ని కలిశారు. పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్టును ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను టీడీపీ దుర్వినియోగపరచడం, మాల్‌ప్రాక్టీస్ కు పాల్పడటం.. లక్షల్లో దొంగ ఓట్లు అంటూ తప్పుడు ఫిర్యాదులు చేయడం.. పక్క రాష్ట్రాలకు చెందిన దొంగ ఓటర్లను చేర్పించడం.. మొత్తం 6 అంశాలపై సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. సీఈసీతో భేటీ అనంతరం ఎంపీ శ్రీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటేః 6 అంశాలపై సీఈసీని కలిశాంః కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు మిగతా కమిషనర్లు, అధికారుల బృందాన్ని ఈరోజు నేను, నాతోపాటు మా పార్టీ ఎంపీ భరత్ కలిశాం. ఎన్నికలకు సంబంధించి ఓటర్లజాబితాల సవరణలు, వివిధ రాజకీయ పార్టీల తీరుతెన్నులపై మా పార్టీ తరఫున మేము మొత్తం ఆరు అంశాల్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాము. గుర్తింపులేని పార్టీ జనసేనః – జనసేన పార్టీ అనేది గుర్తింపులేని పార్టీ. – అలాంటి పార్టీకి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసే అవకాశం ఇవ్వరాదు. – సాధారణంగా రికగ్నైజ్డ్ పార్టీలకే ఎన్నికల సంఘాన్ని కలిసి వారి వారి అభ్యంతరాల్ని చర్చించే అవకాశం ఉంటుంది. – మాకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీకి కూడా సీఈసీని కలిసే అవకాశమిచ్చారు. – ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తింపులేని జనసేనపార్టీకి సీఈసీని కలిసే అవకాశం ఎలా ఇవ్వగలిగారని మేము కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాము. జనసేన ఎవరికి అలెయెన్స్ పార్టీ..? – తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరిన అపాయింట్‌మెంట్ రిక్వెస్టులో జనసేన పార్టీ తమ అలెయెన్స్ పార్టీగా చెప్పి దాన్ని కూడా అనుమతించాలని కోరింది. – మరి, ఇప్పటి వరకు జనసేన పార్టీ బీజేపీ అలెయెన్స్ పార్టీగా పనిచేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. – దీన్నిబట్టి జనసేన పార్టీ అనేది బీజేపీకి అలెయెన్స్ పార్టనర్‌నా..? తెలుగుదేశం పార్టీకి అలెయెన్స్ పార్టనర్‌నా..? అనేది స్పష్టపరచాల్సిన అవసరముందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరాము. – రెండు వేర్వేరు పార్టీలతో అలెయెన్స్ పెట్టుకున్న గుర్తింపులేని పార్టీ జనసేనను ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఎలా అనుమతించారనేదే మా వాదన. గాజుగ్లాసు సింబల్ కేటాయింపు చట్టవిరుద్ధంః – జనసేన పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీకి దిగుతోంది. అలాంటి, గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్‌గా ఉన్న గాజుగ్లాసు గుర్తును కేటాయించడం కూడా చట్టవిరుద్ధం. ఇదే విషయాన్ని మేము ఎన్నికల కమిషన్‌కు రెండో అంశంగా నివేదించాము. బోగస్ కంప్లైంట్‌దారుడు కోనేరు సురేష్‌పై చర్యలేవి..? – తెలుగుదేశం పార్టీకి చెందిన కోనేరు సురేష్ అనే వ్యక్తి ఆపార్టీ ఎలక్ట్రోరల్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను డూప్లికేటింగ్, డబుల్ ఎంట్రీస్, నాన్ లోకల్, బోగస్ ఓట్లంటూ ఒక బల్క్ కంప్లైంట్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపాడు. – ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 లక్షల పైచిలుకు ఓట్లు బోగస్‌గా ఉన్నాయని.. వాటిపై ఎంక్వైరీ చేయాలని సీఈసీకి కూడా ఫిర్యాదివ్వడం జరిగింది. – ఒకే ఒక వ్యక్తి రాష్ట్రంలోని 175 స్థానాల్లో 10 లక్షల ఓట్లకు సంబంధించి బల్క్ కంప్లైంట్‌ను ఎలా ఇవ్వగలుగుతాడు..? దాన్ని ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్వీకరింస్తుందని మేము ప్రశ్నిస్తున్నాము. – తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన బల్క్ కంప్లైంట్‌ను ఆధారంగా చేసుకుని ఎన్నికల అధికారయంత్రాంగం మొత్తం పనిచేస్తుందా..? అని మేము అడుగుతున్నాము. – రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్లకు ఆ ఫిర్యాదుపై ఎంక్వైరీలు చేయాలని ఆదేశాలొచ్చాయి. అయితే, సదరు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్‌లు చాలా సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తే ఫిర్యాదులో ఏ కొంచెం నిజం లేదని తేలింది. – దీన్నిబట్టి కోనేరు సురేష్ అనే వ్యక్తి ఎన్నికల కమిషన్ సమయాన్ని ఎంతగా వృథా చేశాడో అర్ధం చేసుకోవాలి. – ఈరకంగా తెలుగుదేశం పార్టీ అబద్ధపు ఫిర్యాదులిచ్చి.. విలువైన ఎన్నికల సంఘ సమయాన్ని వృథాపరచడం చట్టవ్యతిరేక చర్యగా పరిగణించాల్సింది గా సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. – కోనేరు సురేష్ ఇచ్చిన కంప్లైంట్ బోగస్ అని తేలింది కనుక.. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము సీఈసీని కోరాము. టీడీపీ అబద్ధపు ఫిర్యాదుల బాగోతం ఇదిః – ఇక, తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలపై రోజుకో అబద్ధంతో అటు ఓటర్లనూ.. ఇటు ఎన్నికల సంఘాన్ని తప్పుదోవబట్టిస్తుంది. – ఆ పార్టీకి చెందిన కోనేరు సురేష్ పెట్టిన బల్క్ కంప్లైంట్‌లో వాస్తవాల్ని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. నిజానిజాల్ని రుజువు చేశారు. మూడు జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని మేము ఆర్‌టీఐ ద్వారా తీసుకున్నాము. – కర్నూలు జిల్లాలో టీడీపీకి చెందిన సురేష్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయన్నాడు. అయితే, వీఆర్వోలు వెరిఫై చేసిన తర్వాత వాటిల్లో 59,054 ఓట్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. అంటే, 87 శాతం జెన్యూన్ ఓట్స్‌గా తేలింది. మిగతా ఓట్లు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం పరిధిలోకి నివాసం ఉంటున్న ఓటర్లుగా గుర్తించారు. – అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో 40,358 ఓట్లు బోగస్‌గా ఉన్నట్టు కంప్లైంట్ ఇస్తే.. వాటిల్లో 25,097 మంది ఓటర్లు స్థానికంగానే నివాసం ఉంటున్నట్లు తేలింది. అంటే, 62 శాతం ఓట్లుకు సంబంధించి అతనిచ్చిన కంప్లైంట్‌లో అబద్ధం చెప్పాడు. – విశాఖపట్నం జిల్లాలో 38, 872 ఓట్లు బోగస్‌గా కంప్లైంట్ ఇస్తే.. వాటిల్లో 26,123 ఓట్లు జెన్యూన్‌గా ఉన్నట్లు తేలింది. అంటే, 67 శాతం ఓట్లు వాస్తవంగా ఉన్నట్లు తేలిన నిజం. – దీన్నిబట్టి, అందరూ అర్ధం చేసుకోవాల్సిన నిజమేమంటే.. తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగానే వైఎస్‌ఆర్‌సీపీ ఓట్లను టార్గెట్ చేసి వాటిని తొలగించేందుకు ప్రయత్నించింది. – వైఎస్‌ఆర్‌సీపీ మద్ధతుదారులు, సానుభూతిపరుల ఓట్లను టార్గెట్ చేసిన కోనేరు సురేష్‌లాంటి దుర్మార్గులు తెలుగుదేశం పార్టీలో ఇంకా అనేకమంది ఉన్నారు. అలాంటివారిని ప్రోత్సహించరాదని.. అబద్ధపు కంప్లైంట్‌లిచ్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరాము. – బల్క్‌కంప్లైంట్‌లు ఒకే వ్యక్తి ఇచ్చినట్టయితే.. అలాంటి వాటిని స్వీకరించరాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని మేము కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరాము. ‘మైపార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’తో టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ః – వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 14 డిసెంబర్ 2023న కేంద్ర ఎన్నికల సంఘానినికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. – తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుందని మేము ఆ ఫిర్యాదులో పేర్కొని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చాం. – ఓటరు యొక్క కులమేంటి..? మతం ఏంటి..? గతంలో ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు..? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు..? అనే అడిగే హక్కు రాజ్యాంగం ప్రకారం ఎవరికీ లేదు. కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విధమైన ఓటర్ ప్రొఫైలింగ్‌కు పాల్పడుతుందనే విషయాన్ని మేము గతంలోనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాం. ఓటర్ ప్రొఫైలింగ్ మాల్‌ప్రాక్టీస్ తీరిది..: – ఎన్నికల కమిషన్ డ్యాష్‌బోర్డులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’లో ఓటరు పేరు, ఊరు, ఇతర చిరునామా, జెండర్, వయసు, కులంతో పాటు అతను సపోర్టు చేసే పొలిటికల్ పార్టీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలున్నాయి. – అంటే, రాజకీయ పార్టీల వారీగా ఓటర్లను వేరుచేయడమనేది చట్టవిరుద్ధ చర్యగా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. – తెలుగుదేశం పార్టీ సేకరించిన ఓటర్ డేటా మొత్తాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక సర్వర్ పాయింట్ వద్ద స్టోర్ చేస్తున్నారు. – అచ్చంగా ఇలాంటి మాల్‌ప్రాక్టీస్ గతంలోనూ టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా సేకరించడం.. అప్పట్లో ఆ యాప్‌పై ఎన్నికల సంఘం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. – అప్పట్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్ నెంబర్ 174–2019పై కూడా ఎలాంటి పురోగతి లేదన్న సంగతిని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. – ఇప్పుడు ‘మైపార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్’ ద్వారా ఆ పార్టీ చేస్తున్న కార్యక్రమంపై 120(బి), 379,420,188 (ఐపీసీ), 72, 66 (ఐటీఏ 2000 యాక్ట్) కింద యాక్షన్ తీసుకోవాలని మేము ప్రధాన ఎన్నికల సంఘాన్ని కోరాము. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ’పై ఫిర్యాదుః – తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి చట్టవిరుద్ధంగా సమాచారాన్ని సేకరించడం ఆపార్టీ మాల్‌ప్రాక్టీస్‌లో ఒకభాగంగా చేసుకుంది. – 2024 నుంచి రాబోయే ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ పథకాల ద్వారా ఓటరు ఎంత మేలు పొందుతాడనే లెక్కలేసి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ ’ అనే ప్రమాణపత్రంతో కూడిన కార్డుల్ని పంపిణీ చేస్తున్నారు. – ఇలా దాదాపు 2 లక్షల 40 వేల మందికి ఈ కార్డులందజేతను మేము ఆధారాలతో సహా పట్టుకుని సీఈసీకి ఫిర్యాదు చేశాము. తండ్రీకొడుకుల అసభ్యపదజాలంపై ఫిర్యాదిచ్చాంః – నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో, లోకేశ్ యువగళం పాదయాత్రలోనూ మా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మా పార్టీ అధినాయకులు, గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారిపైన అసభ్యకరమైన పదజాలం వాడుతూ దూషించడాన్ని మేము కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాం. – ఈ తండ్రీకొడుకులపై ఇండియన్ పీనల్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని మేము ఎన్నికల కమిషన్‌ను కోరాము. ‘ఎర్రబుక్కు’ బెదిరింపులపై చర్యలు తీసుకోవాలిః నారా లోకేశ్ ఎక్కడ తన పార్టీ మీటింగ్‌లో మాట్లాడినా.. ఒక ఎర్రబుక్కు చూపిస్తూ.. ‘తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అధికారుల్ని ఈ ఎర్రబుక్కు (రెడ్‌బుక్)లో ఎక్కించి.. మేము అధికారంలోకి రాగానే వారిని జైళ్లకు పంపుతాను..’ అంటూ బెదిరిస్తున్నాడు. – నిజానికి, ప్రభుత్వ అధికారులు ఏ పొలిటికల్ పార్టీకి పనిచేయరు. అధికారులెప్పుడూ బ్యాలెన్సింగ్‌గానే పనిచేస్తారు. – అలాంటి అధికారులపై ఎక్కడో ఒకటీ అరా ఆరోపణలొచ్చినంత మాత్రానా తమ టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ముద్ర వేస్తూ.. వారిని సస్పెండ్ చేస్తానంటూ.. జైళ్లకు పంపుతానంటూ భయభ్రాంతులకు గురిచేయడం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. ఇదే విషయాన్ని మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. – నారా చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ మీద తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము వైఎస్‌ఆర్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు ఉభయరాష్ట్రాల్లోనూ ఒకేరోజున జరపాలిః – ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజున నిర్వహించాలని మేము కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం. – ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాల సవరణల్లో చాలా దొంగపనులు చేస్తోంది. గడచిన కాలంలో చంద్రబాబు అధికారంలోకొచ్చిన ప్రతీసారి మోసపూరిత, కుట్రపూరితమైన విధానాలతోనే ఎన్నికల ప్రక్రియను నడిపించాడు. – మరలా, ఇప్పుడు అలాంటి దొంగపనులకు శ్రీకారం చుట్టాడు కనుక మేం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అప్రమత్తం చేస్తున్నాం. 4.36 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించాం: – ఓటర్ల పేర్లలో చిన్నపాటి అక్షరాల మార్పు చేసి స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసమున్నట్లు ఓట్ల చేరివేత కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టింది. – తండ్రిపేరు మార్చడమో లేదంటే భర్తకు భార్య పేరు మార్చడమో ఇలాంటి చిన్నచిన్న మార్పులతో డూప్లికేట్ ఓట్లను తయారు చేసుకునేందుకు ఆ పార్టీ తెగించిందనేది తెలుసుకున్నాము. – తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓట్లను కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్‌ప్రాక్టీస్ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 4 లక్షల 36 వేల 268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ ఆంధ్రాలోనూ డూప్లికేటింగ్ ఓట్లుగా కనిపిస్తున్నాయి. – వీటి వివరాల్ని కూడా ఆధారాలతో సహా సీఈసీకి అందజేసి.. వీటన్నింటినీ జాబితా నుంచి తొలగించాల్సిందిగా కోరాము. తెలంగాణ లో ఓటరునమోదుకు ప్రత్యేక శిబిరాలుః – తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున.. అక్కడున్న ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్‌ను రేపటి ఆంధ్రా ఎన్నికల్లో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహం పన్నింది. – అందులో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో ఓట్ల చేర్పులు జరుగుతున్నాయి. – తెలుగుదేశం పార్టీ అనుకూల సామాజికవర్గ ఓటర్లను తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం.