14 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడే సింహం కాలేకపోయాడు..ఇప్పుడెలా?

 వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

న్యూఢిల్లీ:  చంద్ర‌బాబు తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. 
తొడేళ్లు, నక్కలు ఎప్పుడూ సింహంగా మారినట్టు కలలు కంటుంటాయి. సింహంలా గర్జించాలని చూస్తాయి. కాని జన్మత: వచ్చిన ఊళ ఎంత ప్రయత్నించినా పోదు. విపక్షనేతకు కూడా సింహంలా మారాలని ఆశ. 14 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడే కాలేకపోయాడు. ఇప్పుడు కొత్తగా సింహం ఎలా అవుతాడు? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను ఈ నెల 3వ తేదీన క‌లిసిన ఫోటోను విజ‌య‌సాయిరెడ్డి కొద్దిసేప‌టి క్రితం ట్వీట్ చేశారు. 

Back to Top