కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం చూసైనా పరివర్తన తెచ్చుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

న్యూఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విఫ‌రీతంగా అప్పులు చేస్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్న ప్ర‌తిప‌క్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామ‌న్ పార్ల‌మెంట్ వేదిక‌గా చెప్పిన స‌మాధానం చూసి పరివ‌ర్త‌న తెచ్చుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సూచించారు. ఈ మేర‌కు బుధ‌వారం ఎంపీ ట్వీట్ చేశారు. రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన సమాధానం చూసైనా పరివర్తన తెచ్చుకోవాలి. 2019 మార్చినాటికే రాష్ట్రానికి రూ.2,64,451 రుణభారం ఉండగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం 1,77,991 కోట్లే. 10 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం చేయడం దుర్మార్గం కదా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top