బీసీలు టీడీపీకి దూరం..వైయ‌స్ఆర్‌సీపీకి ద‌గ్గ‌ర‌

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విజ‌య‌వాడ‌:   టీడీపీకి బీసీలు దూరం అవుతున్నారని, వైయ‌స్ఆర్‌ సీపీకి దగ్గర అవుతున్నారని  వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ఈ విష‌యం చంద్రబాబుకు అర్ధం అయ్యిందని.. ఫ్రస్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నాలు, విధ్వంసాలకు పాల్పడే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.  చంద్రబాబు ఏం చేసినా డ్రామానే.. అని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు, లోకేష్‌కు నిజంగా ఇదే ఆఖరి ఎన్నిక అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధ‌వారం విజ‌య‌వాడ‌లో విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనా కాలంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశాడు? అని నిలదీశారు..  వైయ‌స్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న కేబినెట్‌లో 11 మంది మంత్రివర్గ సభ్యులు బీసీలే ఉన్నారు.. కానీ, చంద్రబాబు సమయంలో అలాంటి పరిస్థితి లేదన్నారు.. తన సొంత కులానికే చంద్రబాబు ప్రయోజనం కలిగిస్తాడు అని మండిప‌డ్డారు. సీఎం వైయ‌స్‌ జగన్‌కు బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్‌గా విజ‌య‌సాయిరెడ్డి అభివర్ణించారు.
 ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పని చేయటమే నా విధి అని విజ‌య‌సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో బండారు, అయ్యన్న పాత్రుడు లాంటి టీడీపీ నాయకులు చేసిన అక్రమాలను నేను నిరూపిస్తాను అంటూ సవాల్‌ చేశారు.. ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటే నేనే విడిపించి ప్రభుత్వానికి అప్పగించానని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

Back to Top