బాబుకు ఇవే చివరి ఎన్నికలు.. జీవితంలో మళ్లీ సీఎం కాలేడు

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి

చంద్రబాబు, లోకేష్ సైకోల్లా మాట్లాడుతున్నారు.. బాబు అస‌లు నాయకుడే కాదు

బాబుకు కుల పిచ్చి.. చేసేవన్నీ దొంగ పనులు

పాద‌యాత్ర కాదు.. పొర్లు దండాలు పెట్టినా లోకేష్‌ను జనం నమ్మరు

విజ‌య‌వాడ‌: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. 2024 తర్వాత ఆ పార్టీ కూడా ఉండదు. చంద్రబాబు తన జీవితంలో మళ్లీ సీఎం కాలేడు. లోకేష్, చంద్రబాబులకు వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్ ఉండదు అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఇప్పుడు చివరి అవకాశం ప్లీజ్ అంటున్న చంద్ర‌బాబుకు ఆఖరి అవకాశం ఇస్తే ఏం చేయ‌గ‌ల‌వు చంద్రబాబూ.. అని ప్రజలే ప్రశ్నిస్తున్నారన్నారు. విజయవాడలో "జయహో బీసీ మహా సభ" ఏర్పాట్లు పరిశీలించిన అనంత‌రం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

``చంద్రబాబుకు 2014-19 మధ్య అధికారం ఇస్తే.. నిర్లక్ష్య వైఖరితో, అసంబద్ధంగా పరిపాలన చేశాడు. దాంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది. మూడు సార్లు సీఎం చేసిన రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. గోబెల్స్, చంద్రబాబు అన్నదమ్ముల్లాంటి వాళ్లు. చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబితే.. నిజమని ప్రజలు భావిస్తారని అనుకుని నిత్యం అబద్ధాలను ప్రచారం చేస్తారు. చంద్రబాబు పుట్టినరోజు కూడా ఏప్రిల్ 20 అంటే.. 420. చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులు. చంద్రబాబు అసలు నాయకుడే కాదు. కుల పిచ్చి ఉన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు కేవలం తన కులం, తన కుటుంబం, తన మనుషుల కోసమే పనిచేశాడు. 

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి.. ఇంకోవైపు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ.. రాష్ట్రాన్ని అన్నివిధాలా ముందుకు తీసుకువెళుతుంటే.. సైకోల్లా చంద్రబాబు, లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్ ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేడు. అతనికి రాజకీయంగా అవగాహన సున్నా.. ఏ విషయం మీద కనీస అవగాహన లేని వ్యక్తి లోకేష్. చెడ్డ అలవాట్లన్నీ ఉన్న వ్యక్తి లోకేష్. అటువంటి లోకేష్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరు. లోకేష్ లాంటి అసమర్థుడ్ని ప్రజలు నాయకుడిగా అంగీకరించరు. అధికారం వస్తుందని చంద్రబాబు, లోకేష్ కలలు కంటున్నారు. వారి కలలు కల్లలే. నూటికి నూరు శాతం వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీ అధికారంలోకి వస్తుంది. గతంలో కంటే ఎక్కువ ఓట్లు, సీట్లతో అధికారంలోకి వస్తాం. మరో 25 ఏళ్లు వైయ‌స్ జ‌గ‌న్ సీఎం గా ఉంటారు. పేదల కోసం సీఎం వైయ‌స్‌ జగన్ పనిచేస్తున్నారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా పక్కాగా అమలవుతున్నాయి. చంద్రబాబును ఎవరు మాత్రం చంపాలనుకుంటారు..? ఎవరైనా చంపాలనుకుంటే.. అది వాళ్ల‌ అవివేకమే అవుతుంది. చంద్రబాబును ఎందుకు చంపుతారు. ఏమీ చేయలేని అసమర్థులు చంద్రబాబు, లోకేష్‌లు. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయి. చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు డ్రామాల పార్టీకి అధినాయకుడు అయిన చంద్రబాబు.. తాను అభద్రతాభావంలో ఉన్నట్టు నాటకం ఆడుతున్నాడు. ఇదంతా సానుభూతి కోసం డ్రామా`` అని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. 

Back to Top