ఈనెల 7న "జయహో బీసీ మహా సభ"

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మ‌హాస‌భ‌

హాజరు కానున్న బీసీల ఆత్మబంధువు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌

84 వేల మంది బీసీ ప్రతినిధులను సభకు ఆహ్వానించాం

`వెనుకబడిన కులాలే వెన్నెముక` నినాదంతో మరింత ముందుకు..

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

విజ‌య‌వాడ‌: ఈ నెల 7వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న "జయహో బీసీ మహా సభ" ఏర్పాట్లను పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా  "జయహో బీసీ మహా సభ-వెనుకబడిన కులాలే వెన్నెముక.. అన్న నినాదంతో" బీసీ మహా సభ పోస్టర్ ను పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు విడుదల చేశారు. దాదాపు 84 వేల మందికి పైగా బీసీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యే ఈ మహాసభను విజయవంతం చేయాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత‌ విజయసాయిరెడ్డి కోరారు. గ్రామస్థాయి నుంచి పార్లమెంటు వరకు ఆయా పదవుల్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ ప్రజాప్రతినిధి తప్పనిసరిగా ఈ సభకు హాజరుకావాలని, ఒకవేళ ఎవరికైనా ఆహ్వానాలు అందకపోయినా, ఇదే ఆహ్వానంగా భావించి సభకు రావాలని విజయసాయిరెడ్డిగారు విజ్ఞప్తి చేశారు. 

ఎంపీ విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..
``వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జయహో బీసీ.. పేరుతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో భారీ బీసీ మహాసభ నిర్వహిస్తోంది. వెనుకబడిన వర్గాలే వెన్నెముక.. అన్న నినాదంతో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ఆధ్వర్యంలో 7వ తేదీన మహాసభ జరుగుతుంది. ఈ మహాసభకు గ్రామ పంచాయతీల్లోని వార్డు సభ్యుల నుంచి ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న వారందరూ దాదాపు 84 వేల మంది బీసీ ప్రతినిధులు హాజరుకానున్నారు. 

7వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ మహాసభ ప్రారంభం అవుతుంది. 12 గంటలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ హాజరై ప్రసంగిస్తారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది.. రాబోయే కాలంలో ఏం చేయబోతుంది అనేది ముఖ్యమంత్రి వివరిస్తారు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ పదవులు పొందిన ప్రతి ఒక్క బీసీ ప్రతినిధులను ఈ సభకు ఆహ్వనిస్తున్నాం. ఈ సమావేశాల అనంతరం రీజనల్‌ స్థాయిలో జోనల్‌ సమావేశాలు కూడా నిర్వహిస్తాం. ఆ తర్వాత జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ప్రణాళిక బద్దంగా బీసీ సభలు నిర్వహిస్తాం. జ్యోతిరావుపూలే జయంతి కార్యక్రమం లోపల ఈ సమావేశాలన్నింటినీ పూర్తి చేయాలని నిర్ణయించాం. "బీసీలే వెన్నెముక" అన్న ప్రాతిపదికగా మా పార్టీ, ప్రభుత్వం ముందుకెళుతోంది. ఒక్క రాజ్యసభలోనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 50 శాతం మంది సభ్యులు బీసీలే ఉన్నారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అత్యున్నత స్థానం కల్పించిన పార్టీ వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఏ ఒక్క అసౌకర్యం లేకుండా జయహో బీసీ మహా సభను విజయవంతంగా నిర్వహిస్తాం`` అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 

Back to Top