భూకబ్జాలు చేస్తున్న దొంగ...వెలగపూడి రాము

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  టీడీపీ నేత వెల‌గ‌పూడి రామ‌కృష్ణ చౌద‌రి భూక‌బ్జాలు చేస్తున్న దొంగ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. వంగవీటి రంగాను హత్య చేసి...విశాఖకు పారిపోయి వచ్చి భూకబ్జాలు చేస్తున్న దొంగ...వెలగపూడి రాము. రుషికొండ గ్రామం సర్వే నం.21లో 379 గజాల ప్రభుత్వ పొరంబోకు భూమిని కబ్జా చేస్తే నేనే కంప్లైంట్ ఇచ్చి గోడ పగలకొట్టించి ప్రభుత్వానికి అప్పగించా. ఇలాంటి నీ కబ్జా లీలలు కోకొల్లలు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

క‌ల్లుతాగిన కోతిలా వీరంగం ఎందుకు?
ఒట్టేసి ఒక మాట-వేయకుండా ఒక మాట...నా దగ్గర ఉండదు ఓవర్ యాక్షన్ వెలగపూడి రామకృష్ణ చౌదరి. కబ్జా చేయకపోతే, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నపుడు కల్లుతాగిన కోతిలా వీరంగం ఎందుకు వేసినట్లో. ఫుడ్ కోర్టులో పేదల షాపుల నుంచి కూడా నెల మామూళ్లు లాగేసే వాడివి... అవి ఆగిపోవడంతో నీ మైండ్..! అంటూ విజ‌య‌సాయిరెడ్డి అంత‌కు ముందు మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top