ప్రజా సేవల వ్యవస్థ పనితీరులో ఆంధ్రప్రదేశ్‌ ముందుంజ 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విజ‌య‌వాడ‌: రాష్ట్రాల్లో ప్రజలకు ప్రభుత్వమే సేవలు అందించే వ్యవస్థ (పబ్లిక్‌ సర్వీస్‌ డెలివరీ సిస్టమ్‌) పటిష్ఠంగా నడిస్తేనే ప్రజాస్వామ్యం సక్రమంగా సాగుతున్నట్టు పరిగణిస్తారు. ఇండియాలో ఇప్పుడు ప్రజా సేవల విధానం అత్యంత సమర్ధంగా నడుస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 2004లో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి ఆయ్యాక ప్రజాసేవలపై దృష్టి సారించారు. అంతకు ముందు ఏ కాంగ్రెస్‌ సీఎం ఆలోచించని రీతిలో కొత్త మార్గాలను ఆయన ఎంచుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సాయం అవసరమైన ప్రజానీకం సంక్షేమంపై ఆలోచించారు. సాగు సంక్షోభంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి తక్షణ ఊరట కల్పించడానికి వెంటనే అనేక చర్యలు తీసుకున్నారు. తన ఐదున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉందనే భరోసా ఇచ్చారు జననేత వైఎస్‌. జనం నాడి తెలిసిన ఈ డాక్టరు గారు ప్రవేశపెట్టిన పథకాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అమలులో ఉన్నాయంటే– ప్రజా సేవలు సమకూర్చే వ్యవస్థకు ఆయన ఎంతటి గట్టి పునాది వేశారో అర్ధమౌతుంది. నేడు నవ్యాంధ్ర ప్రదేశ్‌ కూడా అనేక పథకాల ద్వారా ప్రజలకు పలు రకాల సేవలు అందిస్తూ ఆదర్శ సంక్షేమ రాష్ట్రంగా విలసిల్లుతోంది. గ్రామాలను, పట్టణాలు, నగరాల్లో వార్డులను ప్రత్యేక యూనిట్లుగా పరిగణించి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు నూతన వ్యవస్థలు ఏర్పాటుచేశారు. వేలాది మంది కొత్త సిబ్బందిని నియమించారు. నిరంతరం ప్రజావసరాలు తీర్చడానికి నెలకొల్పిన వ్యవస్థ అత్యంత చలనశీలంగా పనిచేస్తోంది. అవసరమైన ప్రజలకు ఇంటి ముందుకు రేషన్‌ తీసుకొచ్చి అందించే వాహనాలు, సిబ్బంది మొదలు వారికి ఇళ్ల స్థలాలు, కట్టిన ఇళ్లు సొంతం కావడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం. పేద ప్రజలకు విద్య, వైద్యం, ఇతర అవసరాలు తీర్చడానికి గత మూడేళ్ల నుంచీ అమలులోకి తెచ్చిన కొత్త పథకాలు చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా సేవలు సమకూర్చే వ్యవస్థలకు ఇస్తున్న ప్రాధాన్యం అందుకు చేసే వ్యయం కళ్లకు కడుతోంది. చేతి వృత్తులపై ఆధారపడిన వర్గాల కోసం అవసరమైతే ఎంతో శ్రమకోర్చి మరీ నిధులు సేకరిస్తోంది ఏపీ ప్రభుత్వం. జనం ఎన్నుకున్న, జనం అవసరాలు తీర్చే ప్రభుత్వంగా వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కారు నేడు దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. లాభం లేదా ప్రతిఫలం ఆశించకుండా ప్రభుత్వం చేయాల్సిన పనులు, సకల జనులకు అందించే సేవలే ఏ ప్రభుత్వ పనితీరుకైనా సాక్ష్యాధారాలు. భారీ వ్యయంతో అందించే సేవల వల్ల ప్రభుత్వ ఖాజానాకు కొంత భారమేగాని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చక్రాలు వేగంగా ముందుకు పరిగెడతాయని ఏపీ ఆర్థిక సూచీలు, మానవాభివృద్ధి వివరాలు చెప్పకనే చెబుతున్నాయి. అయితే, ఈ వాస్తవాలు చూడడానికి నిరాకరించే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుకూల పత్రికలకు రాష్ట్ర ప్రభుత్వం చేసే సాధారణ రుణాలు, వాటిపై వసూలయ్యే వడ్డీలు మాత్రమే కనిపిస్తాయి. కావాలని ఒక కన్ను మూసి, మరో కన్ను తెరచే వారికి సంపూర్ణ దృశ్యం ఎన్నటికీ కనిపించదు.

తాజా వీడియోలు

Back to Top