ద్రౌప‌ది ముర్ముకు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల ఘ‌న స్వాగ‌తం

విజ‌య‌వాడ‌:  రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ‌న్న‌వ‌రంలోని విమానాశ్ర‌యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భ‌ర‌త్‌, గోరంట్ల మాధ‌వ్ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్‌ హాల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొనేందుకు ముర్ము రోడ్డు మార్గంలో బ‌య‌లుదేరారు.

Back to Top