చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే

అమరావ‌తి భూ కుంభ‌కోణంపై సీబీఐతో ద‌ర్యాప్తు జ‌రిపించాలి

పార్ల‌మెంట్ వెలుప‌ల వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల నిర‌స‌న‌

న్యూఢిల్లీ:  చ‌ట్టం ముందు ప్ర‌ధాని మొద‌లు, సామాన్య జ‌నం వ‌ర‌కు అంద‌రూ స‌మానులేన‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. అమ‌రావ‌తి భూ స్కామ్ కేసుపై హైకోర్టు స్టే విధించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తి భూ కుంభ‌కోణంపై సీబీఐతో ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని డిమాండు చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు పార్ల‌మెంట్ వెలుప‌ల నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ..అవినీతి నిరోధ‌క చ‌ట్టం సెక్ష‌న్‌19(3) ప్ర‌కారం హైకోర్టుకు స్టే ఇచ్చే అధికారం ఉండ‌ద‌ని, రాష్ట్ర పోలీసుల‌పై కోర్టుకు న‌మ్మ‌కం లేక‌పోతే సీబీఐకి అప్ప‌గించ‌వ‌చ్చు అన్నారు. అమ‌రావ‌తి ల్యాండ్ స్కామ్ కేసుపై స్టే చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు చేసిన అవినీతిపై ద‌ర్యాప్తు చేసి ఆ నిధిని ప్ర‌భుత్వ ఖ‌జానాకు జ‌మ చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌యోజ‌నాలు కాపాడ‌ట‌మే మా ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

స్టే ఇవ్వ‌డం దుర‌దృష్ట‌క‌రం: ఎంపీ మార్గాని భ‌ర‌త్ 
రాజ‌ధాని భూముల స్కాంపై స్టే ఇవ్వ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఈ కేసుపై సీబీఐ విచార‌ణకు ఇవ్వాల‌ని ఎంపీ మార్గాని భ‌ర‌త్ డిమాండు చేశారు. ఫైబ‌ర్ గ్రిడ్ స్కాంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు.

మీడియాపై ఆంక్ష‌లా: ఎంపీ శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు 
మీడియాపై ఆంక్ష‌లు విధిస్తూ గాగ్ ఆర్డ‌ర్ ఇచ్చార‌ని ఎంపీ శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు పేర్కొన్నారు. చిన్న చిన్న కేసులను కూడా సీబీఐ విచార‌ణ‌కు ఇస్తున్నార‌ని, కేబినెట్ స‌బ్ క‌మిటీ విచారించి సిట్‌ను ఏర్పాటు చేస్తే దానిపై స్టే ఇచ్చార‌న్నారు. అమ‌రావ‌తి భూ స్కాంపై సీబీఐ విచార‌ణ‌కు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top