ర‌ఘురామ‌కృష్ణంరాజును డిస్ క్వాలిఫై చేయాలి

లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల విన‌తి

న్యూఢిల్లీ: న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి, లోక్‌స‌భ నాయ‌కుడు మిథున్‌రెడ్డి, చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్ కోరారు. ఈ మేర‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు విన‌తిప‌త్రం అంద‌జేశారు.  త‌మ పార్టీ టికెట్‌పై గెలిచి, ఆ త‌ర్వాత పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ ర‌ఘురామ‌కృష్ణంరాజు పార్ల‌మెంట్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని ఇప్ప‌టికే అనేక‌మార్లు స్పీక‌ర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. 

ఇదే కార‌ణంతో నేడు మ‌రోసారి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు  లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీలు మాట్లాడుతూ ర‌ఘురామ‌కృష్ణంరాజు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతుండ‌డంపై గ‌తంలోనే ఆధారాల‌తో స‌హా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశామ‌న్నారు. 

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా  మరోసారి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని  తెలిపారు. 

Back to Top