నీతిమాలిన రాజకీయాలు మానుకో బాబూ..

మత కలహాలు సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు 

నీతి, నిజాయితీ ఉంటే రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేయాలి

కర్నూలును న్యాయ రాజధాని చేస్తే ఎందుకంత కడుపుమంట

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, సంజయ్‌కుమార్, రంగయ్య

ఢిల్లీ: అమరావతి భూములు, ఫైబర్‌ గ్రిడ్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. ఢిల్లీలో ఏపీ భవన్‌ వద్ద ఎంపీలు గోరంట్ల మాధవ్, డాక్టర్‌ సంజయ్‌కుమార్, తలారి రంగయ్య మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించేందుకు కుతంత్రాలు చేస్తున్నాడని, అంతర్వేది ఘటనను అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని కాల్చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలను ఇకనైనా పక్కనబెట్టాలన్నారు. 

తల్లిలాంటి పార్టీని విమర్శిస్తున్న రఘురామకృష్ణంరాజు ఒక ద్రోహిగా మిగిలిపోయాడని «ఎంపీ డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. నీతి, నిజాయితీ ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తే రఘు రామకృష్ణరాజుకు ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కాఫీతోటల పెంపకానికి ఇవ్వాలని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఏపీకి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తామన్నారు. కేంద్రం మంత్రులను కలిసి నిధుల కోసం ప్రయత్నం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

 

తాజా వీడియోలు

Back to Top