మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు 

వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి 
 

అమరావతి : మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయ్యాడని  వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి విమ‌ర్శించారు. టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయాలనేమో నారా లోకేశ్‌ను జాకీలు పెట్టి లేపుతున్నారని ఆయ‌న ఎద్దేవా చేశారు.  శనివారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు నాయుడు, లోక్‌శ్‌పై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఐదు వారాలే అయిందన్న స్పృహ కూడా లేకుండా, తండ్రి సైగతో వరుస ట్వీట్లు చేస్తూ.. నవ్వులు పూయిస్తున్నారని విమర్శించారు. సీఎం కొడుకు, మంత్రిగా ఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయ్యాడన్నారు.

అవినీతి కేసుల్లో లోపల వేస్తరేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తొస్తుందన్నారు. తనను అరెస్ట్ చేస్తే చుట్టూ నిలబడి రక్షణ కల్పించాలని గతంలో ప్రజలను వేడుకున్నారని, ఇప్పుడేమో తనకేదైనా అయితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని బెదిరిస్తున్నారని తెలిపారు. దాడి నాటకానికి ప్లాన్ చేశారా చంద్రబాబు? అంటూ ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో గుర్తించిన ఫోభియాలను సైకాలజీ 5 కేటగిరీలుగా విభజించిందని, చంద్రబాబుకు సైకియాట్రిక్ పరీక్షలు చేస్తే ఆరో కేటగిరి కూడా ఉందని తేలుతుందని మండిపడ్డారు. ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కడప, పులివెందులలాగా మారుస్తున్నారని పదేపదే తన అకారణ భీతిని(ఫోభియా) వ్యక్తం చేస్తుంటారాని దుయ్యబట్టారు.

Back to Top