రాష్ట్రాన్ని చెద పురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తారా?

ట్విటర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
 

అమరావతిః నిరుద్యోగ యువతను  గ్రామ వలంటీర్లుగా నియమిస్తుంటే..మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా చంద్రబాబు గారు అంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో ప్రశ్నించారు. ప్రజలను పీడించుకు తిన్న  జన్మభూమి కమిటీలకు,గ్రామ వలంటీర్లకు తేడా ఏంటో త్వరలోనే తెలుస్తుంది. అందాకా కాస్త ఓపిక పట్టండి.ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటారు.ఇంకో పక్క మాపై విచారణకు ఆదేశించి కక్ష సాధిస్తున్నారంటున్నారు. ఏ  తప్పూ చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు గారు ? రాష్ట్రాన్ని చెద పురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా? అంటూ ట్విట్‌ చేశారు.

 

Back to Top