రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసు చంద్రం

చంద్ర‌బాబు, టీడీపీ ముఠాపై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిపాటు

విశాఖపట్నం: ముసలి చంద్రం నాయుడు, ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదనే ఉన్నాయ‌ని, టీడీపీ హ‌యాంలో పేద‌లు వ‌ల‌సెళ్లిపోతుంటే చంద్ర‌బాబు ఆనందించాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. రాజధానిగా విశాఖపై టీడీపీ అక్కసు వెళ్లగక్కుతున్న నేప‌థ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘ఉత్తరాంధ్రలో చంద్రంకు ఏం పని? వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పు. డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు? వీళ్లంతా మిడతల దండులా వచ్చి విశాఖలో 80% భూములు ఆక్రమిస్తే ‘కమ్మ’గా ఉందర్రా కూనా?’

‘ముసలి చంద్రం నాయుడు, ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదనే. పేదలు వలస పోతుంటే ఆనందించారు. పరిశ్రమలు పెడతామని వస్తే బాబు అమరావతికి రమ్మనేవాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆయన హయాంలోనే బీజం పడింది. రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసు’ అని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top