2024 ఎన్నికలే టీడీపీకి ఆఖరి పోరాటం.. ఆపై అస్త్ర సన్యాసం

ట్విట్ట‌ర్ వేదిక‌గా వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చుర‌క‌లు

విశాఖ‌: 40 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న తెలుగుదేశం పార్టీ మరో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చుర‌క‌లంటించారు. అయితే తుప్పు- పప్పు నాయుళ్లు మాత్రం అర్థశతకం కొట్టేదాకా కూడా టీడీపీని బతకనిచ్చేలా లేరని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికలే ఆఖరి పోరాటం.. ఆపై అస్త్ర సన్యాసం అనేలా ఉన్నాయ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

అదే విధంంగా ``ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విజయోత్సవాలు నిర్వహిస్తారట టీడీపీని పాతరేసిన చంద్రబాబు! పార్టీ  స్థాపించిన చోట ఒక్క ఎమ్మెల్యే, కార్పోరేటర్ ఎందుకు గెలవలేక పోయారు? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాకే కదా తెలంగాణాలో జెండా పీకేసింది!`` అని మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top